బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక, ఎందుకు?

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ సందర్భంగా హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, దోషులకు కఠినమైన శిక్ష విధించడంతో పాటు హిందువులకు భద్రత కల్పించాలని పునరుద్ఘాటించారు.

హిందువుల భద్రత గురించి షేక్ హసీనా ప్రభుత్వం కొన్నాళ్లుగా మాట్లాడుతూనే ఉంది. కానీ వారి భద్రతను భారత్‌లోని నాయకులకు ముడిపెడుతూ బుధవారం ఆమె మాట్లాడిన తీరు మాత్రం మినహాయింపు. బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి భారత్ కూడా జాగ్రత్త వహించాలని హసీనా అన్నారు. బంగ్లాదేశ్‌తో పాటు అక్కడ ఉన్న హిందువులపై ప్రభావం పడే విధంగా భారత్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆమె వ్యాఖ్యానించారు.

”భారత్‌లో ఏం జరుగుతుందనే దానిపై బంగ్లాదేశ్ అగ్ర నాయకత్వం బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి” అని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ కార్యదర్శి తౌహిద్ హుస్సేన్ బీబీసీ బంగ్లాతో అన్నారు. ”మామూలుగానైతే భారత్‌కు మేమిలా నేరుగా, స్పష్టమైన సందేశాన్ని ఇవ్వం. దేశంలోని అధికార పార్టీ బీజేపీకి చెందిన అత్యంత శక్తిమంతమైన నేత కూడా బంగ్లాదేశ్ గురించి అభ్యంతరకర భాషను ఉపయోగించారు. అప్పుడు కూడా మేమిలా బహిరంగంగా మాట్లాడలేదు” అని అన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఉద్దేశించి కఠినమైన భాషను ఉపయోగించారు. దీనిపై బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం దీని గురించి బహిరంగంగా ఏం మాట్లాడలేదు. కానీ బుధవారం షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నాయి.

అసలు భారత్‌కు షేక్ హసీనా ఏం చెప్పాలనుకుంటున్నారు? ”సందేశం చాలా స్పష్టంగా ఉంది. భారత్‌లో జరుగుతోన్న మతపరమైన సంఘటనలపై బంగ్లాదేశ్ స్పందించింది. ఇలాంటి ఘటనలపై భారత్ దృష్టి సారించాలని హసీనా స్పష్టంగా చెప్పారు. ఆమె చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఏం జరిగిందో మేం కూడా చూశాం” అని తౌహిద్ అన్నారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు