Night Curfew In Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ, రాత్రి 11 నుంచి ఉదయం 5వరకు, 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లపై ఆంక్షలు

Night Curfew In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూ విధంచారు. థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడవాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

night-curfew-in-andhra-pradesh

గత వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 1వ తేదీన ఒక్కసారిగా కేసులు 16 వేల నుంచి రోజుకు 24వేల వరకు పెరిగాయి. తాజాగా 24 గంటల్లో దేశంలో సుమారు లక్షా 80 వేల కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒమిక్రాన్ వైరస్ కూడా తోడైవడంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు.

భహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుంపులుగా ఉండేటల్లు కఠిననిబంధనలను అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ రోజు నుంచే అంటే 10వ జనవరి రాత్రి 11 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరీలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశలో గడిచిన 24 గంటల్లో 1500 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో వైరస్ ను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఈ నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు