Ayyapa Swamy 18 Steps Story: అయ్యప్ప స్వామి 18 మెట్ల కథ

Ayyappa Swamy 18 Step Story: కేరళ శబరిమళ ఆలయానికి ఈ పద్దెనిమిది మెట్లు చాలా ప్రాముఖ్యం కలిగి యున్నది. మాల వేసుకున్న స్వాములు ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కి స్వామి వారి సంపూర్ణ దర్శనం చేసుకుంటారు. 1980 వరకు భక్తులు ఈ పద్దెనిమిది మెట్లలో ప్రతీ మెట్టుకి కొబ్బరి కాయ కొట్టడంతో మెట్లు శిధిలమయిపోయేవీ దీంతో అప్పటి నుంచి మెట్లను పంచ లోహాలతో చేశారు. ఇప్పుడు కొబ్బరి కాయలను మెట్ల పై కాకుండా పక్కకు కొట్టే విధంగా ఏర్పాటు చేశారు.

the-story-of-ayyappa-swamy-eighteen-steps

అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కి అయ్యప్ప దర్శనం చేస్తే దీక్ష పూర్తవుతుందని నమ్మకం. ఈ పద్దెనిమిది మెట్లను పరశురాముడు నిర్మించడంతో ఈ క్షత్రానికి “పరశురామ క్షేత్రము అనే పేరు వచ్చింది”.

అయ్యప్ప స్వామి 12 ఏళ్ల వరకు మణికంఠునిగా పందలరాజు దగ్గర పెరుగుతాడు. మహిశిని వధించిన తరువాత అయ్యప్ప తన అవతారాన్ని చాలిస్తాడు. శబరిగిరిలో అయ్యప్ప ఉన్నత స్థానానికి వెళ్లడానికి వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం ఇలా ఇవన్నీ 18 మెట్లగా అమరాయని, వాటిపై అయ్యప్ప కాలు మోపి ఉన్నత స్థానాలను అధిష్టించాడని పురాణం చెబుతుంది. ఇప్పుడు విగ్రహం ఉన్నట్లుగానే పట్టబంధాసనంలో అయ్యప్ప కూర్చొని ఉన్నారని, చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చారనీ, అనంతరం యోగసమాధిలోకి వెళ్లి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారనీ పేర్కొంటున్నారు.

18 మెట్లకు పద్దెనిమి అష్టాదశ దేవతలు ఉన్నారు

  1. మహాంకాళి
  2. కళింకాళి
  3. భైరవ
  4. సుబ్రహ్మణ్య
  5. గంధర్వరాజ
  6. కార్తవీర్య
  7. కృష్ణ పింగళ
  8. హిడింబ
  9. బేతాళ
  10. నాగరాజ
  11. కర్ణ వైశాఖ
  12. పుళిందిని
  13. రేణుకా పరమేశ్వరి
  14. స్వప్న వారాహి
  15. ప్రత్యంగళి
  16. నాగ యక్షిణి
  17. మహిషాసుర మర్దని
  18. అన్నపూర్ణేశ్వరి

18 మెట్లకు ప్రత్యేక పేర్లు

  1. అణిమ
  2. లఘిమ
  3. మహిమ
  4. ఈశ్వత
  5. వశ్యత
  6. ప్రాకామ్య
  7. బుద్ధి
  8. ఇచ్చ
  9. ప్రాప్తి
  10. సర్వకామ
  11. సర్వ సంపత్కర
  12. సర్వ ప్రియకర
  13. సర్వమంగళాకార
  14. సర్వ దు:ఖ విమోచన
  15. సర్వ మృత్యుప్రశమన
  16. సర్వ విఘ్న నివారణ
  17. సర్వాంగ సుందర
  18. సర్వ సౌభాగ్యదాయక

అయ్యప్ప ఒక్కో మెట్టుకు విడిచిన అస్త్రాలు

  1. శరం
  2. క్షురిక
  3. డమరుకం
  4. కౌమోదకం
  5. పాంచజన్యం
  6. నాగాస్త్రం
  7. హలాయుధం
  8. వజ్రాయుధం
  9. సుదర్శనం
  10. దంతాయుధం
  11. నఖాయుధం
  12. వరుణాయుధం
  13. వాయువ్యాస్త్రం
  14. శార్ఞాయుధం
  15. బ్రహ్మాస్త్రం
  16. పాశుపతాస్త్రం
  17. శూలాయుధం
  18. త్రిశూలం

శబరిమళలో 18 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత, పురాణ చరిత్ర ఉంది. శబరిగిరి చుట్టూ ఉన్న 18 కొండలకు ఈ మెట్లు ప్రతీకలని కూడా పురాణం చెబుతుంది. ఆ 18 కొండల పేర్లు ఇవే:

శబరి చుట్టూ 18 కొండలు

  1. పొన్నాంబళమేడు
  2. గౌదవమల
  3. నాగమల
  4. సుందరమల
  5. చిట్టమ్బలమల
  6. ఖలిగిమల
  7. మాతంగమల
  8. దైలాదుమల
  9. శ్రీపాదమల
  10. దేవరమల
  11. నీల్కల్ మల
  12. దాలప్పార్ మల
  13. నీలిమల
  14. కరిమల
  15. పుత్తుశరిమల
  16. కాళైకట్టిమల
  17. ఇంజప్పారమల
  18. శబరిమల

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు