Medaram Jathara 2022 Dates: మేడారం జాతర 2022 తేదీలు, ప్రత్యేకతలు, మేడారం జాతర చరిత్ర

Medaram Jathara 2022 Dates: మేడారం జాతర ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి వస్తుంది. 2020 ఫిబ్రవరీలో చివరి సారిగా మేడారం జాతరను నిర్వహించారు. మళ్లీ రెండేళ్ల తరువాత ఈ నెల ఫిబ్రవరీ 16 నుంచి ఫిబ్రవరీ 19 వరకు నిర్వహించనున్నారు. నాలుగు రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో సుమారు కోటికి పైగా భక్తులు పాల్గొననున్నారు. ఇది ప్రధానంగా గిరిజనుల పండగ, దీనిని మహాజాతర అని కూడా అంటారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్నా దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్త చర్యలను చేపట్టింది.

Medaram Jathara 2022 Dates

సమ్మక్క సారక్క జాతరను ఎలా జరుపుకుంటారు?

ప్రతీ రెండేళ్లకు ఓసారి ఈ పండగ వస్తుంది. జాతరలోని సమ్మక్క సారక్కల అమ్మవార్లకు బంగారం, బెల్లంను కానుకగా ఇచ్చి అక్కడే ఉన్న జంపన్న వాగుల పవిత్ర స్నానం చేస్తారు. సారక్క, పగిడిద్ద రాజుల విగ్రహాలను మేడారంకు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. మాఘ మాసంలో శుధ్ధ పౌర్ణమి నాడు ఈ జాతర ప్రధాన ఘట్టం జరుగుతుంది. ఈ జాతరలో రెండు గద్దెలుంటాయి. ఒక గిద్దె సమ్మక్కకి మరో గిద్దె సారక్కకి. భక్తులు ఈ గిద్దెలలో తాము తీసుకువచ్చిన బెల్లాన్ని, బంగారాన్ని సమర్పిస్తారు.

మొత్తం నాలుగు రోజులు ఈ జాతర జరుగుతుంది. ఏరోజు ప్రత్యేకత ఆ రోజుకు ఉంది

  • ఫిబ్రవరి 16న ‌ ‌‌‌‌‌- సారక్క, పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెల దగ్గరికి తీసుకువెళ్తారు
  • ఫిబ్రవరి 17న ‌- చిలుకల గుట్టనుంచి సమ్మక్కని గద్దెలవద్దకు తీసుకువస్తారు
  • ఫిబ్రవరి 18న – భక్తులు సమ్మక్క సారక్కలకు చెట్లను, బంగారం, బెల్లాన్ని కానుకలుగా అందిస్తారు
  • ఫిబ్రవరి 19న – సమ్మక్క సారక్కలను తిరిగి గద్దెల నుంచి అడవిలోకి చేరుస్తారు. దీంతో మహాజాతర సమాప్తమవుతుంది.

సమ్మక్క సారక్క జాతర చరిత్ర

13వ శతాబ్దంలో ఆంధ్రా వరంగల్ ప్రాంతాలను కాకతీయులు పరిపాలించేవారు. అప్పుడు అడివిలో గిరిజనులు వేటాడుతుండగా ఒక చిన్న పాప పులులతో ఆడుకుంటూ కనిపించింది. గిరిజనులు ఆ పాపను వారి గిరిజనుల రాజుకు అప్పగించారు. రాజు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు.

సమ్మక్కకు మరో గిరిజన రాజు పగిడిద్దకు ఇచ్చి వివాహం చేస్తారు. వారికి ముగ్గురు పిల్లలు, నాగులమ్మ, సారక్క, జంపన్న జన్మిస్తారు. కాకతీయులు పగిడిద్దను కప్పం ఎక్కువ కట్టమని డిమాండ్ చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కాకతీయులు ఘోరంగా దెబ్బతింటారు కానీ చివర్లో సమ్మక్క కుటుంబం మొత్తం హత్యకు గురవుతుంది. అప్పటి నుంచి సమ్మక్క, సారక్కలను దైవాంశసంభూతులుగా అక్కడి గిరిజనులు ఆరాధిస్తూ వస్తున్నారు.

ఇవి కూడా ఉంది

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు