How Many Yugas In Telugu: ఎన్ని యుగాలు ఉన్నాయి?

How many yugas in telugu: వేదశాస్త్రాలను బట్టి మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఇంకా కలియుగం. ప్రస్తుతం మనము కలియుగంలో ఉన్నాము. జ్యోతిష్య పండితులు ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు లేదా రాజు ఉన్నారని అంటారు. ఈ నాలుగు యుగాల గురించి ఇప్పుడు మనము వివరంగా తెలుసుకుందాం.

How many yugas in telugu

కృతయుగం

ఈ యుగానికి సత్యయుగం అని పేరు కూడా ఉంది. ప్రస్తుత కలియుగం అనంతరం వచ్చేది సత్యయుగమేనని పండితులు చెబుతుంటారు. నారాయణుడు లక్ష్మీ సహితముగా వచ్చి భూమిని పరిపాలిస్తాడు. తెల్ల గుర్రం పై వచ్చి ప్రజల్ని ఏలుతాడు అని అంటారు. ఈ సత్యయుగం 17లక్షల 27 వేల సంవత్సరాలు ఉంటుందని లెక్కగట్టారు. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందని చెబుతారు.

త్రేతాయుగము

రామాయణం మొత్తం త్రేతాయుగానికి సంబంధించినదే. ఈ యుగంలో భగవంతుడు శ్రీరాముడిగా జన్మించాడు. ఈ యుగం 12 లక్షల 96వేల సంవత్సరములు కొనసాగింది. అయితే రాక్షలు కార్యకలాపాలు పెరిగి ధర్మం మూడు పాదాలపై నడిచిందని అంటారు. ఒక పాదం ధర్మం తగ్గడంద్వారా ద్వాపర యుగం ప్రారంభమైంది.

ద్వాపర యుగం

ఈ యుగంలో భగవంతుడు కృష్ణుడి అవతారంలో వచ్చాడు. ఈ యుగం కాలం 8లక్షల 24 వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపైనే ఉంది. దీంతో ఈ యుగం కలియుగానికి దారి తీసింది.

కలి యుగము

ప్రస్తుతం మనం ఉంటుంది కలియుగమే. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని పండితుల విశ్వాసం. కలియుగం కాలం 4లక్షల 32వేల సంవత్సరాలు. క్రీ.పూర్వము 3102 ఫిబ్రవరి 18న కలియుగం ప్రారంభమైందని.. క్రిష్ణుడు తన అవతారం చాలించిన తరువాత ఇది మొదలైందని హైందవులు భావిస్తారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు