Bhagavad Gita In Telugu: భగవత్ గీతలో ఏముంది, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి?

Bhagavad Gita In Telugu: భగవద్గీత చాలా ప్రసిధ్ది కలిగిన పుస్తకం. ఇది హిందువు పవిత్రగ్రంధంగా గుర్తించపు ఉంది. దాదాపు ప్రపంచలోని అన్ని భాషలకు భగవద్గీత తర్జుమా ట్రాన్స్లేట్ అయింది. ఇందులో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. మహాభారతంలోని కౌరవులూ పాండవులూ కలిసి యుద్దం చేస్తున్న సమయంలో అర్జునిడికి శ్రీకృష్ణుడు కొన్ని విషయాలను, జీవిత, దైవిక సత్యాలను చెబుతాడు. అదే ఈ పుస్తకంలో ఉంది. ఈ పవిత్ర, శక్తివంతమైన పుస్తకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Bhagavad Gita In Telugu

భగవద్గీత మహాభారతంలోని భాష్మ పర్వంలోనిది. ఇందులో మొత్తం 700 శ్లోకములు ఉన్నాయి. మొత్తం 18 చాప్టర్లుగా విభజింపబడి ఉంది. ప్రతీ చాప్టర్ ను లేదా అధ్యాయముని యోగము అని అంటారు. భగవద్గీతను శ్రీకృష్ణుడు చెప్పడానికి ఓ కారణం ఉంది.

అర్జునుడి యుధ్దంలో తనవారిని చంపలేనని కుంగిపోతాడు. నవల్ల వారు చంపబడుతున్నారని దు:ఖిస్తూ యుధ్దం చేయడానికి వెనకాడుతాడు అప్పుడే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునిలో ఉత్తేజాన్ని, విశ్వాసాన్ని నింపుతాడు.

భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయముల పేర్లు: 1. అర్జున విషాద యోగము 2. సాంఖ్య యోగము 3. కర్మ యోగము 4. జ్ఞాన యోగము 5. కర్మసన్యాస యోగము 6. ఆత్మ సంయమ యోగము 7. విజ్ఞాన యోగము 8. అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10. విభూతి యోగము 11. విశ్వరూప సందర్శన యోగము 12. భక్తి యోగము 13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14. గుణత్రయ విభాగ యోగము 15. పురుషోత్తమ ప్రాప్తి యోగము 16. దైవాసుర సంపద్విభాగ యోగము 17. శ్రద్దాత్రయ విభాగ యోగము 18. మోక్ష సన్యాస యోగము

గీతలో శ్రీకృష్ణుడు రకరకాల పేర్లతో అర్జునుడిని పిలుస్తాడు

అర్జున: – పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు
పార్థ: – పృధివి (భూమి యొక్క) పుత్రుడు
కౌంతేయ – సావధానంగా దైవబోధను వినగలిగేవాడు
అనసూయ – అసూయ లేనివాడు
కురునందన – కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు
పరంతప – యుద్దములో శత్రువులను తపింప చేయువాడు
విజయ – ఎల్లప్పుడూ జయమునే పొందువాడు
గుడాకేశ – యింద్రియ నిగ్రహం గలవాడు
ధనంజయ – జ్ఞాన ధనమును పొందినవాడు
పాండవ – పాండవరాజు కుమారుడు

భగవద్గీతలో ఇంకా అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. టీటీడీ దేవస్థానంవారు ఉచితంగా భగవద్గీతను ప్రజలకు అందిస్తున్నారు. రష్యన్ యూనివర్సిటీలో కూడా భగవద్గీతపై రిసర్చులు జరిగాయి. మీరు కూడా వెంటనే ఆలస్యం చేయకుండా భగవద్గీత చదివేయండి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు