Ganapati Stotram In Telugu: గణపతి స్తోత్రం తెలుగులో

Ganapati Stotram In Telugu: ఏ శుభకార్యం జరపాలన్ని ముందు గణపతికి పూజచేయమంటారు పెద్దలు. వరలక్ష్మి పూజ చేసినా, యజ్ఞం చేసినా ఇంకా ఏ ఇతర పెద్ద కార్యాలు, పూజలు చేసినా ముందుగా గణపతి స్తోత్రాన్ని చదువుతూ పూజచేస్తారు.

గణపతి స్తోత్రం

జరగబోయే విగ్నాలను గణపతి తొలగిస్తాడని భావన, నమ్మకం. అందుకే సంకటహర గణపతి అని అంటారు. ఎన్నో గణపతి స్తోత్రలు ఉన్నాయి. దారిద్ర్య దహన గణపతి స్తోత్రం, సంకటహర గణపతి స్తోత్రం, గణేశ మంగలమాలికా స్తోత్రం, ఇలా ఎన్నో గణపతి స్తోత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని స్తోత్రాలను కింద అందుబాటుులో ఉంచాము.

సంకటనాశన గణపతి స్తోత్రం

నారదౌవాచ :
ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్.

ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !

విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్,
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్,
తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః

ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధుం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రదం
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రపుల్ల వారిజాసనం భజామి సింధురాననః || 1 ||

కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్నకంకణం ప్రశోభిత్రాంగ్రి యష్టికం
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమబూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం || 2 ||

సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం
గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం
కవీంద్ర చిత్తరంజకం మహావిపత్తి భంజకం
షడక్షర స్వరూపిణం భజే గజేంద్ర రూపిణం || 3 ||

విరించి, విష్ణు వందితం విరూపలోచన స్తుతం
గిరీశ దర్శనేచ్ఛయా సమర్పితం పరాంబయా
నిరంతరం సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం || 4 ||

మధౌహ లుబ్ధ చంచలాళి మంజు గుంజితా రవం
ప్రబుద్ధ చిత్తరంజకం ప్రమోద కర్ణచాలకం
అనన్య భక్తి మాననం ప్రచండ ముక్తిదాయకం
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం || 5 ||

దారిద్ర్య విద్రావణ మాశు కామదం
స్తోత్రం పఠేదేత దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రసాదాత్. || 6||

గణపతి మంగళ మాలికా స్తోత్రం

శ్రీ కంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంగ వాసినే
ద్వాత్రింశద్రూప యుక్తాయ శ్రీ గణేశాయ మంగళం!

ఆది పూజ్యాయ దేవాయ దంత మోదక ధారిణే
వల్లభా ప్రాణ కాంతాయ శ్రీ గణేశాయ మంగళం!

లంబోదరాయ శాంతాయ చంద్ర గర్వాప హారిణే
గజాననాయ ప్రభవే శ్రీ గణేశాయ మంగళం!

పంచ హస్తాయ వంద్యాయ పాశాంకుశ ధరాయ చ
శ్రీమతే గజ కర్ణాయ శ్రీ గణేశాయ మంగళం!

ద్వైమాతురాయ బాలాయ హేరాంబాయ మహాత్మనే
వికటాయాఖు వాహాయ శ్రీ గణేశాయ మంగళం!

పృష్ణి శృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థ దాయినే
సిద్ధి బుద్ధి ప్రమోదాయ శ్రీ గణేశాయ మంగళం!

విలంబి యజ్ఞ సూత్రాయ సర్వ విఘ్న నివారిణే
దూర్వాదల సుపూజ్యాయ శ్రీ గణేశాయ మంగళం!

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్ర జన్మనే
త్రిపురారీ వరో ధాత్రే శ్రీ గణేశాయ మంగళం!

సింధూర రమ్య వర్ణాయ నాగబద్ధో దరాయ చ
ఆమోదాయ ప్రమోదాయ శ్రీ గణేశాయ మంగళం!

విఘ్న కర్త్రే దుర్ముఖాయ విఘ్న హర్త్రే శివాత్మనే
సుముఖాయైక దంతాయ శ్రీ గణేశాయ మంగళం!

సమస్త గణ నాథాయ విష్ణవే ధూమకేతవే
త్ర్యక్షాయ ఫాల చంద్రాయ శ్రీ గణేశాయ మంగళం!

చతుర్థీశాయ మాన్యాయ సర్వ విద్యా ప్రదాయినే
వక్రతుండాయ కుబ్జాయ శ్రీ గణేశాయ మంగళం!

తుండినే కపిలాక్షాయ శ్రేష్ఠాయ ఋణ హారిణే
ఉద్దండోద్దండ రూపాయ శ్రీ గణేశాయ మంగళం!

కష్ట హర్త్రే ద్విదేహాయ భక్తేష్ట జయదాయినే
వినాయకాయ విభవే శ్రీ గణేశాయ మంగళం!

సచ్చిదానంద రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
వటవే లోక గురవే శ్రీ గణేశాయ మంగళం!

శ్రీ చాముండా సుపుత్రాయ ప్రసన్న వదనాయ చ
శ్రీ రాజరాజ సేవ్యాయ శ్రీ గణేశాయ మంగళం!

శ్రీ చాముండా కృపా పాత్ర శ్రీ కృష్ణ ఇంద్రియాం వినిర్మితా
ం విభూతి మాతృకా రమ్యాం కల్యాణైశ్వర్యదాయినీం!

శ్రీ మహాగణ నాథస్య శుభాం మంగళ మాలికాం
యః పఠేత్ సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్!

ఇతి శ్రీకృష్ణ విరచితం శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం సంపూర్ణం !!

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు