Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రం

Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రాన్ని ప్రతీ రోజు 9సార్లు జపిస్తే సర్వ సౌఖ్యాలు దక్కి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సిద్ధ మంగళ స్తోత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది.

సిద్ధ మంగళ స్తోత్రం
pic credit: i.pinimg.com

దత్తాత్రేయ స్వామే శ్రపాద వల్లభ స్వామిగా పునర్జన్మనెత్తారని భావిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం గ్రామంలో అప్పలరాజు శర్మ, సుమతి మహారాణికి శ్రీపాద వళ్లభ స్వామి జన్మిచారు. సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతీరోజు 9సార్లు జపిస్తే సర్వ సౌఖ్యములు, మానసనిక ప్రశాంతత లభిస్తుంది.

సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీచరణా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ….

శ్రీ దత్త శ్శరణం మమ శ్రీపాద రాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

సిద్ధ మంగళ స్తోత్రం లిరికల్ వీడియో

సిద్ధ మంగళ స్తోత్రానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉండడంతో ఈ శ్లోకాన్ని పాడుతూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిన లిరికల్ వీడియోలు యూట్యూబ్ లో చాలా వున్నాయి. వాటిలో ఒకదాన్ని కింద మీకు షేర్ చేసాము.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు