Guppedantha Manasu డిసింబ్ 7 ఎపిసోడ్: అరటి ఆకులు అయిపోయాయని వసు వాటిని తీసుకురావడానికి ఆటోలో వెళ్తుంది, అప్పుడు రిషి కూడా ఆమెతో వెంట వెళ్తాడు. తిరిరి వచ్చే సమయంలో ఇద్దరి మధ్య రొమాంటిక్ టచ్ స్టార్ట అవుతుంది.. అయితే ఆ తరువాత ఏమి జరిగిందనేది ఈ ఎపిసోడ్ లో చూద్దాం.
311 ఎపిసోడ్ హైలేట్స్..
రిషి, వసుధర ఇద్దరు ఆటో దిగుతారు. ఇలా వీళ్లిదరినీ చూసి జగతి మురిసిపోతుంది. రిషి చేతిలోంచి అరటి ఆకులను వసు లాక్కుంటుంది. “మీరు మా ఎండీ, మీరు పట్టుకోవడం ఎంటి సార్” అని ఆకులు తీసుకుంటుంది. రిషి, వసు ఇద్దరు కలిసి నిడిచివస్తుండడం చూసి మహేంద్ర సంబరపడిపోతుంటాడు. అయితే దీన్నంతటినీ చూసి దేవయాని కలవరపడుతుంది. వెంటనే ఏదో ఒకటి చేయాలి లేదంటే చేయి దాటిపోతుందని అనుకుంటుంది.
మినిస్టర్ గారు, దేవయాని, ఫణీంద్ర భోజనానికి కూర్చుంటారు. మినిస్టర్ గారు.. రిషిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. రిషి పక్కన జగతిని కూడా కూర్చోమంటాడు. ఇది చూసి దేవయాని మళ్లీ రగిలిపోతుంది. వసు సంబరపడిపోతూ అందరికీ వడ్డిస్తుంది.
పుఫ్ప అక్కడ అందరూ తింటున్న దృశ్యాలను ఫోటో తియ్యడానికి సిద్దమవుతుంది. కానీ రిషికి అది నచ్చదు, కోపంగా చూస్తాడు. అవేమీ పట్టించుకోకుండా.. పుఫ్ప చేతి నుంచి వసు ఫోన్ అందుకుని ఫోటోలు తీయడం మొదలుపెడుతుంది. “అందరినీ కలిపి ఫోటోలు తియ్యమ్మ ఇవన్నీ మధురమైన మంచి మెమొరీస్ గా మిగిలిపోతాయి” అని మినిస్టర్ గారు అంటారు.
వసు రిషికి వడ్డిస్తూ.. ఈ కర్రీ వేసుకోండి సార్ చాలా బాగుంటుందని రిషికి ఇష్టం లేకున్నా వసు వడ్డిస్తుంది. ఇది మనసులో పెట్టుకున్న రిషి.. వసు తినడానికి కూర్చోగానే, కర్రీస్ అన్నీ కలిపి రిషి వడ్డిస్తాడు. ఇది చూసి జగతి నవ్వుకుంటుంది.. కానీ వసు మాత్రం, సార్ లో ఎంత మార్పు వచ్చిందోనని అనుకుంటుంది.
“నేను బయల్దేరతాను కొంచం పని ఉంది, మీరు కాసేపు ఉండి వెళ్లండి” అని మినిస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాసేపటి తరువాత అందరూ అక్కడినుంచి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తారు. దేవయాని వాళ్లు ఒక కారులో, జగతి మరో కారులో వెళ్తారు. జగతి వెళ్లేటప్పుడు వసుని వెంట రమ్మని పిలుస్తుంది. అయితే అన్నం, కూరలు మిగిలిపోయాయి, వాటిని అనాధాశ్రమానికి పంపించి పుష్పతో కలిసి వస్తానని వసు చెబుతుంది.
వసు, రషి ఒకరికి ఒకరు తెలియకుండా ఇద్దరూ అదే ఫామ్ హౌస్ లో ఉండిపోతారు. కొంతసేపటి తరువాత మినిస్టర్ బావమరిది వచ్చి.. “అమ్మా మీరు బమల్దేరడానికి కారు వచ్చేసింది” అని వసుకు చెబుతాడు. అప్పుడు వసు అక్కడున్న ఊయల్లో కూర్చొని రిషిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలా ఎవరో అక్కడికి వస్తారు. వచ్చిన వాళ్లు రిషినే అని కమింగ్ అప్ లో చూపిస్తారు. ఆ తరువాత ఏం అవుతుందనేది, వచ్చే ఎపిసోడ్ లో చూద్దం.