Bigg Boss 5 telugu winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ టైటిల్ ను వీజే సన్నీ దక్కించుకున్నాడు. వీడియో జాకీగా, జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సన్నీ అంచలంచెలుగు టీవీ ఆర్టిస్ట్ నుంచి ప్రస్తుతం ఫిలిం యాక్టర్ గా, బిగ్ బాస్ 5 విన్నర్ గా ఎదిగాడు. బిగ్ బాస్ హౌస్ లో షన్ముక్ తరువాత అంత పెద్ద ఫ్యాన్ ఫాలోవింగ్ ఉంది సన్నీకి మాత్రమే.
తెలుగు టీవీ సీరియల్స్ ఫాలో అయ్యేవారికి సన్నీ గురించి ప్రత్యేకంగా వివరించిన అవసరం లేదు. కళ్యుణవైభోగంలో మెయిల్ లీడ్ లో యాక్ట్ చేశాడు సన్నీ. అంతకు ముందు మామ్యూజక్ లో డాన్స్ కవర్ వీడియో సాంగ్స్ చేశాడు. ఏబిఎన్ చానల్ లో సినీ జర్నలిస్ట్ గా కూడా వర్క్ చేశాడు.
బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ (Bigg Boss 5 Telugu Winner)
కళ్యాణ వైభోగం సీరియల్ నుంచి సన్నీ అందరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు. టాలీవుడ్ స్టార్ హీరోకు ఏమాత్రం తక్కువ కాకుండా సన్నీ నటన, డాన్స్, డైలాగ్ డెలీవరీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. వీజే సన్నీ అసలు పేరు అరున్ రెడ్డీ.
బిగ్ బాస్ 5 హౌస్ లో రెండవ కంటెస్టెంట్ గా వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ లవర్స్ కు సన్నీ గురించి అప్పటికి అంత తెలియకున్నా క్రమంగా సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు తెలుస్తూ వచ్చాయి. సన్నీ బిహేవియర్, మ్యానరిజమ్స్ కూడా అందరికంటే భిన్నంగా ఉంది. కాంట్రవర్సా క్రియేట్ చేయాలి, కంటెంట్ కోసం ఎదైనా చేసెయ్యాలి అనే లక్షణాలు సన్నీలో కనిపించలేదు.
ఒకరిద్దరు తప్పిస్తే.. దాదాపు అందరితో సన్నీ మంచిపేరు సంపాదించుకున్నాడు. హౌస్ క్యాప్టెన్ కావడానికి ఎంతో కృషి చేశాడు. ప్రత్యేకంగా క్యాప్టెన్ డ్రెస్ ని కూడా సన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. తొలి వారం నుంచి 15వ వారం వరకు కూడా సన్నీ ఎన్ని సార్లు నామినేషన్లో ఉంటే.. అన్ని సార్లు అత్యధిక ఓట్లతో 1 లేదా రెండవ స్థానంలో ఉంటూ వచ్చాడు.
BB6 Opinion Poll Website: bigg boss 6 telugu vote
వీజే సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. 1989 ఆగస్టు 17న ఖమ్మం జిల్లాలో జన్మించాడు. అక్కడే నిర్మలా హౌస్కూల్ నుంచి పాఠశాల విద్యని, హోదరాబాద్ లోని సెంట్ మెరీస్ కాలేజ్ నుంచి డిగ్రీని కంప్లీట్ చేశాడు. సన్నీకి చిన్నప్పటి నుంచి మూవీస్, మాడలింగ్ పై మక్కువ, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తో మా మ్యూజిక్ లో వేడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేశాడు.
2018లో వీజే సన్నీ బిగ్ ఎఫ్ఎమ్ నుంచి “తెలంగాణ ప్రైడ్” అవార్డును అందుకున్నాడు. 2017లో కళ్యాణ వైభోగం సీరియల్ లో మెయిన్ రోల్ ప్లే చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నాడు. మూవీలో కూడా సన్నీకి చాన్స్ వచ్చింది.
మూవీస్ లో కూడా సన్నీకి చాన్స్ వచ్చింది. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న “సకల గుణాభి రామ” సినిమాలో సన్నీ హీరోగా నటిస్తున్నాడు. 2022 లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన అఫీపియల్ వోటింగ్ లో షన్ముక్ కన్నా సన్నీకి డబల్ వోటింగ్ పర్సంటేజ్ రావడంతో సన్నీ ఇమేజ్, రేంజ్, పాపులారిటీ ఆమాంతం పెరిగింది.
బిగ్ బాస్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీకి 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రతీ వారం స్టార్ మా నిర్ణయించిన రెమ్యునరేషన్ కూడా దక్కనుంది. ఒక వారానికి సన్నీ రెమ్యునరేషన్ సుమారు 3 లక్షల వరకు ఉంటుంది. అంటే కేవలం రెమ్యునరేషన్ 40 లక్షల వరకు రావచ్చు, దాంతో పాటు ప్రైజ్ మనీని కలిపితే 90 లక్షల వరకు సన్నీకి స్టార్ మా, బిగ్ బాస్ నుంచి ముట్టనుందని.