Aloe Vera Benefits: కలబంద ఆరోగ్య ప్రయోజనాలు

Aloe Vera Benefits: కలబంద వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. కలబంద ప్రాముఖ్యాన్ని మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడింది. అయినప్పటికి భారతీయ శాస్త్రజ్ఞులు దీన్ని విస్మరించారు. పరాయి దేశస్థులు మనము కనుగ్గన్న కలబంద ఆయుర్వేద విద్యను వేల, లక్షల కోట్లలో క్యాష్ చేసుకుంటున్నాయి. బ్యాటీ ఇండస్ట్రీలకు కలబంద ఓ పెద్ద రా మెటీరియల్. కలబంద గురించిన మరిన్న విషయాలను మనము తెలుసుకుందాం.

aloe-vera-benefits-telugu-కలబంద

కంబందని సంస్కృతంలో కుమారీ అని పిలుస్తారు, ఆంగ్లంలో Aloe Vera అని అంటారు. కలబంద చట్టు పెద్దగా పెరిగిన తరువాత వాటి మట్టలను అడ్డంగా కోస్తే దాని నుంచి ఓ తెల్లని చిక్కటి ద్రవం వస్తుంది. దీనినే మూసాంబరం అంటారు. దీనిని ఎండలో ఎండబెడితే నల్లగా అవుతుంది. ఆ తరువాత దీన్ని భద్రపరుచుకొని ఆయుర్వేదంలో చికిత్సకు ఉపయోగిస్తారు.

కలబంద చర్మ ప్రయోజనాల

చర్మానికి సంబంధించి ఎన్నో చిట్కాల్లో ఈ కలబందను ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులను నివారించటంలో తయారు చేసే ఎన్నో ఔషదాల్లో కూడా ఈ కలబందను వాడతారు. కలబంద వయసు పెరుగుదలను నిరోధిస్తుంది. కలబందలో గిసరిన్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ లాంటి అనేక పోషకాలు ఉంటాయి.

కలబంద తేమ ప్యాక్ తయారీ విధానం

  • 1 teaspoon కలబంద గుజ్జు
  • ½ teaspoon ఆలివ్ నూనె

పైరెండినీ బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి పూసుకోవాలి. 30 నిమిశాల తరువాత కడుక్కోవాలి. అప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనబడుతుంది.

కలబంద గుజ్జు

వేేరే వాటిని ఏమి కలపకుండా నేరుగా కలబందనే మీ ముఖంపై రాసుకోవచ్చు. కలబంద ఆకులను అడ్డంగా కత్తిరించి వాటిలోపల ఉన్న గుజ్జును ఓ గిన్నెలో తీసుకుని ఫేస్ పై కొంత సేపు మసాజ్ చేయండి. అలా చేస్తే మీ చర్మంపై ఉన్న జిడ్డు తొలగిపోయి, కాంతివంతంగా తయారవుతుంది.

కలబంద మొటిమలను తగ్గిస్తుంది

మొటిమలను తగ్గించడానికి కలబందలో నిమ్మరసం చుక్కలను పిండుకొని ముఖానికి మసాజ్ చేయాలి. ఓ గంట తరువాత చల్లనీటితో కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. మొటిమలు నెమ్మదిగా తగ్గుతుంటాయి. రెండు వారాల పాటు ఇలా చేస్తే మొటిమలు మొత్తం మాయం అవుతాయి.

కొన్ని కలబంద చిట్కాలు

  • కలబంద గుజ్జులో కొంత రోజ్ వాటర్ వేసుకొని మసాజ్ చేసుకుంటే.. మొటిమలు, పిగ్మెంటేషన్, మచ్చలు పోతాయి
  • కలబంద ఆకులను నీళ్లల్లో ఉడకబెట్టి, ఆ గుజ్జుని ముఖానికి రాయాలి. 20 నిమిశాల తరువాత కడుకోవాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే.. చర్మం ప్రకాశవంతమవుతుంది.
  • అలోవెరా జెల్, కీరా రసం, పెరుగు, రోజ్ నూనెను కలిపి ముఖం, మెడపై రాయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగితే మెడపైన ర్యాషస్, మురికి వదుల్తాయి.
  • కలబంద గుజ్జును తీసుకొని రోజ్ వాటర్ ను కలిపి శరీరానికి రాసుకుంటే బాడీబయట ఉన్న మృత కణాలు పోతాయి.
  • కాలిన చోట కలబంద రసాన్ని రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • కలబంద వల్ల జుట్టుకు కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆయుదము నూనె, కలబంద మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. ఎలా పట్టించాలనే పధ్దతిని ఇక్కడ తెలుసుకుందాం.

కలబంద గుజ్జుకు కావాల్సినవి

  • 2 టేబుల్ స్పన్స్ కలబంద గుజ్జు
  • 1 టేబుల్ స్పూన్ ఆముదము

పై రెండింటినీ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. నెమ్మదిగా జుట్టు కుదుళ్లపై పట్టించి మసాజ్ చేయాలి. రాత్రంతా ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి ఉదయం షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

కలబంద నూనె తయారీ విధానం

  • కలబంద గుజ్జు పావు కిలో
  • కొబ్బరి నూనె పావుకిలో
  • కలబంద మట్టను తీసుకొని లోపల వున్న గుజ్జును గీరాలి
  • ఒక బాండీలో కొబ్బరి నూనెను పోసి మరిగించి దాంట్లో కలబందను వేసి బాగా కలపాలి. బాండీలో నీరు మొత్తం ఆవిరయిపోయి నూనె మాత్రమే మిగుల్తుంది.
  • బాండీని దించి దాన్ని భద్రపరుచుకోవాలి. ఈ నూనెను రోజు గోరువచ్చగా చేసి తలలో కుదుళ్లకు వ్రాసి బాగా మర్దన చేయాలి

కలబంద (Aloe Vera) మరిన్న చిట్కాలు

  • కలబంద రసాన్ని చక్కెరతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
  • కలబందను పాలు, నీళ్లతో కలిపి సేవిస్తే సెగరోగం, గనేరియా మెహ వ్యాధులు ఉపశమిస్తాయి
  • అలోవెరా గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే తగ్గిపోతాయి.
  • అలోవెరా రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్, స్ప్లీన్ వ్యాధులు ఉపశమిస్తాయి
  • రోజు సాయంత్రం ఒకటిన్నర అంగుళాల ఇంచ్ కలబంద ముక్కను తింటే మలబద్దకం సమస్యకూడా తీరిపోతుంది.
  • పంటి నొప్పి ఉన్నప్పుడు కలబందను చిగుళ్లపై ఉంచితే చాలా మంచిది.
  • అన్ని రకాల చర్మవ్యాధులను నివారించే శక్తి కలబందకు ఉంది.
  • ఎండాకాలంలో కలబంద గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు