Figs Health Benefits: అంజీర పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యాపిల్ తరువాత అన్ని పోషకాలు, ఖనిజాలు కలిగిన పండు ఈ అంజీర మాత్రమే. గ్రీకులు ఈ అంజీర పండుకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు అందుకే ఆ సమయంలో అంజీరను వారు ఎగుమతి చేయలేదు. అంజీర పండును ఎండకు ఆరబెట్టి నిలువ చేసుకొని కూడా తింటారు. అంజీర పండుకు సంబంధించిన మరిన్ని విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.
అంజీర పండు ఆరోగ్యప్రయోజనాలు
- అంజీర మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ బాడీలో టాక్సిన్స్, ఉప్పు పదార్ధం ఎక్కువగా ఉంటే మూత్రం ద్వారా అంజీర అంతటినీ బయటకు పంపేస్తుంది.
- ఆయుర్వేదంలో అత్తి ఆకులను అంటే అంజీర పండు ఆకులను యాంటీపైరేటిక్ గా ఉపయోగిస్తారు. బలమైన యాంటీ ఫంగల్ గా అంజీర ఆకులు పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో కనుగ్గొన్నారు.
- అంజీరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతుంది. 28 గ్రాముల అంజీర పండ్లలో శరీరాలనికి రోజూ అవసరమయ్యే 5శాతం కాల్షియం ఉంటుంది. మెగ్నీషియం, భాస్వరం లాంటి ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి.
- గర్భిణులు ఎటువంటి సంకోచం లేకుండా అంజీర పండ్లను తినవచ్చు. డాక్టర్లు ఈ అంజీర పండ్లను ముఖ్యంగా మహిళలకు సిఫారసు చేస్తారు. అంజీరలో విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తల్లి కడుపులోని పిండం బాగా పెరిగేందుకు దోహదపడుతుంది.
- అంజీరలో ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో మలబద్దకం సమస్య అసలు వచ్చే అవకాశం లేదు. తినే ఆహారంలో కొంత అంజీరను సలాడ్ లా వేసుకొంటే జీర్ణ క్రియకు, మలం బయటకి వెళ్లడానికి బాగా దోహదపడుతుంది.
- అంజీరలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. కంటి సమస్యలను నివారిస్తుంది. మాక్యులర్ డీజెనరేషన్ లాంటి కంటి సమస్యను కూడా తగ్గిస్తుంది.
- అంజీర నిద్రలేమి సమస్యను కూడా నివారిస్తుంది. మనకు నిద్రరావాలంటే బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ సరిగ్గా విడదలవ్వాలి. ట్రిప్టోఫాన్ మొటలోనిన్ పై ప్రభావం చూపుతుంది. రోజూ అంజీరను తీసుకుంటే ట్రిప్టోఫాన్ పెరుగుతుంది, పరోక్షంగా అది మెటోలోనిన్ ను విడుదల చేస్తుంది. ఇలా నిద్ర రావడానికి ఆస్కారముంది.
రక్త హీనత తగ్గాలంటే..
భారతదేశ మహిళల్లో 51 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం వారి బాడీలో ఐరన్ లేకపోవడమే. అంజీర్ పండ్లల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఒక అంజీర్ తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య గణనీయంగా తగ్గిపోతుంది.
అంజీర పండ్లతో కలిగే దుష్ప్రభావాలు
- అత్తి పండ్లను మితంగా తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు కలిగే అవకాశం ఉంది.
- డయాబెటీస్ ఉన్న వారు అంజీర్ పండ్లను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచది.
- అంజీర్ పండ్లు రక్తం తాగుతాయి. కాబట్టి మీరు ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకుంటే.. అంజీర్ తినాలా వద్దా అని డాక్టర్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి
- రోజుకు 3 నుంచి 5 అంజీర్ పండ్లకంటే ఎక్కువ తీసుకోవద్దు.
ఇవి కూడా చూడండి
- Safflower Benefits: కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు
- Ginger Health Benefits: అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దుష్ప్రభావాలు
- Health Benefits Of Ajwain: వాము వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు
- Fish Health Benefits & Side Effects: చేపలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు