హాస్యం అనేది తెలుగు సినిమాలో ఎల్లపుడూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలనాటి హాస్య నటులు గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు నిజమైన కాలమ్మతల్లి బిడ్డలు.
మీరు చూస్తున్న ఈ ముగ్గురు హాస్య నటులలో మొదటి వారు చిడతలు అప్పారావు గారు. ఈయన చాలా తెలుగు సినిమాల్లో నటించారు. కానీ ఎందుకో స్టార్ కమెడియన్ కాలేకపోయారు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశారు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు.
ఈయన కామెడీ ‘అల్లరి పిల్ల’ సినిమాలో బాగుంటుంది. చిడతలు అప్పారావు గారు ‘జంబాలకిడి పంబ’, ‘అల్లరి అల్లుడు’, ‘అల్లుడా మజాకా’ లాంటి సాంఘీక సినిమాల్లో నే కాకుండా తెలుగువారు ఎప్పుడూ ఇష్టపడే పౌరాణికాలలో కూడా నటించారు. చిడతల అప్పారావు గారు సినిమా మీద మక్కువతో నాటకరంగం నుంచి వచ్చారు. అయితే సినిమాల్లో మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. సినిమాలో జీవనోపాధి కోసం చిన్న చిన్న వేషాలు వేసేవారు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. డిమాండ్ చేస్తే ఉన్న వేషాలు ఎక్కడ పోతాయో అనే భయంతో ఆయన కూడా కావలసిన పారితోషికం అడిగేవాడు కాదు. సినిమా వేషాల మీదనే ఎక్కువ ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ సహాయకుడిగా వెళ్ళేవారు. కాస్ట్యూమ్స్ విభాగంలో కూడా పనిచేసారు ఈయన.
రెండవ హాస్య నటులు వొమ కూచి నరసింహన్. ఈయన ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటించారు. అలాగే ‘మా పల్లెలో గోపాలుడు’, ‘దేవి’, ‘రక్షకుడు’, లాంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఒకే ఒక్కడు సినిమాలో ఈయన కామెడీ అందర్నీ అలరించింది.
మూడవ హాస్య నటులు అందరికీ సుపరిచితమైన కళ్ళు చిదంబరం గారు. ఈయన కళ్లు చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకుని కళ్లు చిదంబరంగా గుర్తింపు పొందాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాదు చేతిలో మాట్లాడే మేకను కొని మోసపోయే సీన్ లో అద్భుతంగా కామెడీ పండించారు. అమ్మోరు చిత్రం ఈయనకి మంచి గుర్తింపు తెచ్చింది.
ప్రస్తుతం తెలుగు సినిమాకి ఇలాంటి కామెడీ స్టార్ లు కరువయ్యారు. మరోవైపు టీవీలో వచ్చే కామెడీ షోలు టాలెంట్ వున్న వారి జోలోకి రావడం ఎప్పుడో మానేశాయి. కొత్తదనం పేరుతో చెత్త షోలు ఎక్కువయ్యాయి. కామెడీ పండకపోతే యాంకర్స్ తో డాన్సులు వేయించడం ఇప్పడు కొత్త ట్రెండ్ అయిపోయింది. ఎమన్నా అంటే ఈ షోలు మీద చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి నీకేం నొప్పి అనే స్థాయికి దిగజారారు.
ఇవి కూడా చూడండి: