Akhanda OTT Release Date: అఖండ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఫ్లాట్ ఫారమ్, టైమింగ్

Akhanda OTT Release Date, Time: బాక్సాఫీస్ లో ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను బాలయ్య అఖండ సినిమా రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీ లో జనవరి 21న సాయంత్రం 6గంటలకు స్ట్రీమ్ కానుంది. బాలయ్య అభిమానులతోపాటు ప్రేక్షకులకు కూడా ఈ ఓటీటీ రిలీజ్ పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. ఊహించని రీతిలో అఖండ బాక్సాఫీస్ లో కలెక్షన్స్ రాబట్టుకుంది.

Akhanda OTT Release Date, Time

అఖండ మూవీ (OTT Date, Time) ఓటీటీ రిలీజ్ డేట్, ఫ్లాట్ పారమ్, టైమింగ్

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యజైస్వాల్ ప్రధాన పాత్రలో నటించిన అఖండ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. జగపతి బాబు, శ్రీకాంత్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చగా రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

కథ విషయానికి వస్తే.. సినిమాలో ఇద్దరు పసికందుకు జన్మించిన తర్వాత ఒకరికి చలనం ఉండదు ఆ చలనం లేని బాబుని స్వామిజీ పాత్రలో ఉన్న జగపతి బాబు తీసుకొని వెళ్తాడు. ఇద్దరూ యువకుల వయసుకు వచ్చిన తర్వాత ఇద్దరిలో ఒకరు సమాజంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకుంటాడు. మరోకరు గుహల మధ్యలో శివుడి పూజలో లీనమవుతాడు. అయితే వీరు నివసిస్తున్న ఊర్లో వేల కోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుంది. ఈ గూండాలను తన శక్తులతో అఘోరా పాత్రలో ఉన్న బాలయ్య ఎలా ఎదుర్కొంటాడన్నదే అసలు స్టోరీ. బాలకృష్ణ ఇందులో డ్యూయల్ రోల్ ప్లే చేశారు.

అఖండ సినిమా హాట్ స్టార్ లో జనవరి 21న సాయంత్రం 6గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఎవరూ మిస్ కాకుండా కుటుంబ సమేతంగా చూడండి. థియేటర్ లో చూసినా సరే, మరోసారి ఓటీటీలో చూడండి. బాలయ్యా అఘోర పర్ఫామెన్స్ ను ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు