Saamanyudu Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాల్ స్టారర్ సామాన్యుడు ఎట్టకేటలకు థియేటర్లలో ఈరోజు.. అంటే ఫిబ్రవరీ 4న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తొలి రోజే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ సీక్వెన్సస్ బాగా తెరకెక్కించారని, కామెడీ బాగా పండిందని క్రిటెక్స్ సైతం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సామాన్యుడు సినిమా ఒరిజినల్ గా తమిళ్ లో వీరమై వాగై సూడుమ్ పేరుతో ఇదే రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
కథ
సామాన్యుడు సినిమా మొత్తం ఒక థ్రిల్లర్ డ్రామా. మర్డర్, పోలీసుల్ ఇన్వెస్టిగేషన్ల చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. విశాల్ పలీస్ ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. యోగీ బాబు విశాల్ ను డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వొదని మందలిస్తాడు. ఈ క్రమంలోనే ఓ మర్డర్ కేసుకు సంబంధించి విశాలే సొంతంగా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డింపుల్ హయతీ హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. విశాల్, డింపుల్ హయతీ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదురుతుంది. విశాల్ అంతిమంగా ఆ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడనేదే ఈ మూవీలో చాలా ఇన్ట్రెస్టింగ్ గా చూపించారు.
సామాన్యుడు మూవీ నటీనటులు
తు పా శరవాణన్ ఈ సినిమాకు కథ రాయడంతో పాటు ఆయన దర్శకత్వం వహించారు. యాక్టర్ విశాల్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయడంతో పాటు ఆయనే దీన్ని తన సొంత బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై దీన్ని నిర్మించారు. డింపుల్ హయతీ హీరోయిన్ గా నటించింది. యోగీ బాబు సపోర్టింగ్ రోల్ ప్లే చేశాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
మూవీ పేరు | సామాన్యుడు |
దర్శకత్వం | తు పా శరవాణన్ |
నటీనటులు | విశాల్, డింపుల్ హయతీ, యోగి బాబు |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | కెవిన్ రాజ్ |
ఎడిటింగ్ | ఎన్బీ శ్రీకాంత్ |
నిర్మాత | విశాల్ |
ప్రొడక్షన్ బ్యానర్ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
సినిమా ఎలా ఉందంటే
మొత్తం ఫ్యామిలీ కలిసి చూడదగ్గ సినిమా. విశాల్, డింపుల్ హయతీ మధ్య రొమాన్స్ బాగా కుదిరింది. యోగి బాబు యాక్టింగ్ కడుపుబ్బే లా నవ్వించింది. సినిమను అద్భుతంగా తెరకెక్కించారు తుప శరవానన్. డైలాగ్స్ కూడా చలా బాగన్నాయి.