Sebastian PC 524 Movie Review: ఎస్ ఆర్ కళ్యాణ మండంపంతో మంచి క్రేజ్ సంపాదించిన కిరన్ అబ్బవరం మళ్లీ “సెబాస్టియన్ ” తో మనల్ని అలరించడానికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చ్ 4న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. టీజర్ ను చూసి అనేక మంది ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టే సినిమాకు తొలి రోజే మంచి టాక్ వచ్చింది. స్టోరీ, డైరెక్షన్ అద్భతంగా ఉందంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసిస్తున్నారు. సెబాస్టియన్ మూవీ రివ్యూకు సంబంధించిన మరిన్న విశేషాలను తెలుసుకుందాం.
కథ
సెబాస్టియన్ పీసీ 524 ఒక యాక్షన్ కామెడీ థ్రీల్లర్ చిత్రం. ఇందులో రేచీకటితో బాధపడుతున్న కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించారు. హీరోయిన్ గా నువెక్ష నటించింది. తనకు రేచీకటి ఉందని ఎవ్వరికీ తెలియకుండా సెబాస్టియన్ మ్యానేజ్ చేస్తాడు. అయితే ఓ రోజు అతనికి నైట్ డ్యూటీ వేస్తారు. తాను చేసే నైట్ డ్యూటీ సమయంలో మర్డర్ జరుగుతుంది. సెబాస్టియన్ ను కట్టి పడేసి హంతకుడు తప్పించుకుంటాడు. సెబాస్టియన్ సస్పెండ్ అవుతాడు. చివరికి సెబాస్టియ్ ఏం చేస్తాడు.. హంతకుడు ఎలా దొరుకుతాడనేది మెయిన్ కాన్సెప్ట్. ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
నటీనటులు
బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం, నువెక్ష ప్రధాన పాత్రల్లో నటించారు. కోమలీ ప్రసాద్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేసింది. బి సిద్ద రెడ్డి, రాజు, ప్రమోద్ కలిసి జోవిత సినిమాస్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. ఘిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చగా, రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీని, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
మూవీ | సెబాస్టియన్ పీసీ 524 |
దర్శకత్వం | బాలాజీ సయ్యపురెడ్డి |
నటీనటులు | కిరణ్ అబ్బవరం, నువెక్ష, కోమలి ప్రసాద్ |
ప్రొడ్యూసర్ | సిద్ద రెడ్డి బి, రాజు, ప్రమోద్ |
సంగీతం | ఘిబ్రన్ |
సినిమాటోగ్రఫీ | రాజ్ కె నల్లి |
ఎడిటింగ్ | విప్లవ్ నైశధం |
సినిమా ఎలా ఉందంటే?
కుటుంబం మొత్తం కలిసి చేడతగ్గ సినిమా “సెబాస్టియన్ పీసీ 524”. రేచీకటి సమస్యతో బాధపడుతున్నా కానిస్టేబుల్ గా కిరణ్ అబ్బవరం అద్భుతంగా నటించారు. డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్ పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంది. థ్రిల్లర్ కామెడీని కలిపి డైరెక్టర్ బాలాజీ సయ్యపురెడ్డి అద్భుతుంగా చూపించారు. ఘిబ్రాన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది.