Maaran Movie Review: పవర్ఫుల్ జర్నలిస్ట్ గా ధనుశ్ నటించిన సినిమా మారన్ డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ పార్మ్ లో నేరుగా రిలీజ్ అయింది. కార్థిక్ నరేన్ ఈ మూవీని అద్భుతుంగా తెరకెెక్కించారు. ధనుష్, మాలవిక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రివ్యూకి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
కథ
మారన్ సినిమా ఒక కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం. నిజాయితీ కలిగిన రిపోర్టర్ మాతి మారన్ పాత్రలో ధనుశ్ నటిస్తాడు. రాజకీయ నాయకుల అకృత్యాలను, అవినీతిని ప్రజలముందు ఆధారాలతో సహా బయటపెడతాడు. విషయం తెలుసుకున్న విలన్ పళని (సముతిరకని), మారన్ ను హతమార్చడానికి ప్రయత్నిస్తాడు. వారందని నుంచి మారన్ ఎలా తప్పించుకుంటాడు. ఏ నిజాలు, ఎలా బయటపెడతాడనే విషయాలను డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించాడు.
మారన్ మూవీ నటీనటులు
కార్తిక్ నరేన్ ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. ధనుశ్, మాలవిక మోహనన్ ప్రధాన పాత్రలు పోషించారు. సముతిరకని, స్మృతి వెంకట్, రామ్కీ, క్రిష్ణకుమార్ బాలసుబ్రహ్మన్యం, మహేంద్రన్, అమీర్, ఇలవరసు, జయప్రకాశ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.
టిజి. త్యాగరాజన్, సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ మూవీని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చగా, వివేకానంద్ సంతోషమ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. ప్రసన్న జి.కె ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | మారన్ |
దర్శకుడు | కార్తిక్ నరేన్ |
నటీనటులు | ధనుష్, మాలవిక మోహనన్, సముతిరకని, స |
నిర్మాతలు | స్మృతి వెంకట్, రామ్కీ, క్రిష్ణ కుమార్ బాలసుబ్రహ్మణ్యం, మహేంద్రన్ |
సంగీతం | జివి. ప్రకాశ్ కుమార్ |
సినిమాటోగ్రఫీ | వివేకానంద్ సంతోషమ్ |
సినిమా ఎలా ఉందంటే?
కార్తిక్ నరేన్ ఈ మూవీని చాలా బాగా తెరకెక్కించారు. డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ధనుశ్ యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ అయింది. ఒక జర్నలిస్ట్ పవర్ ను దర్శకుడు చాలా బాగా చూపించారు. జివి. ప్రకాశ్ కమార్ మ్యూజిక్ బాగుంది. మొత్తం కుటుంబం కలిసి చూడదగ్గ సినిమా ఇది.