Beast Telugu Movie Box Office Collections: బీస్ట్, యావత్ భారతదేశం లో ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఈ బీస్ట్, ఎట్టకేలకు చాలా గ్రాండ్ గా నిన్న అంటే ఏప్రిల్ 13 న థియేటర్ లో విడుదలైంది, విడుదలైన మొదటి రోజే ఊహించని వసూళ్ళని రాబట్టింది. అయితే ప్రేక్షకులు మరియు క్రిటిక్స్ సైతం ఈ మూవీ కి మంచి రివ్యూస్ ఇచ్చారు, తద్వారా సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు మరియు నటి నటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు, అయితే విజయ్ నటించిన చివరి సినిమా మాస్టర్ మొదటి రోజు సుమారు 5,7 కోట్ల వరకు వసూళ్ళని రాబట్టింది, అది పెద్ద హిట్ అవ్వడం వల్ల బీస్ట్ మూవీ మీద అంచనాలు తారాస్థాయికి చేరాయి, అయితే ఆ అంచనాల్ని అందుకొని బీస్ట్ మొదటి రోజు సుమారుగా 7.4కోట్లు వసూళ్లు చేసింది.అయితే ఇదే విధంగా కొనసాగితే రాబోయేరోజుల్లో ఇంకా మంచి వసూళ్ళని రాబడుతుందని అంచనా.
బీస్ట్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Beast Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 70.3 కోట్లు |
డే 2 | 50 కోట్లు |
డే 3 | 25 కోట్లు |
డే 4 | 12 కోట్లు |
డే 5 | 9 కోట్లు |
డే 6 | 5 కోట్లు |
డే 7 | 2.1 కోట్లు |
మొత్తం కలెక్షన్స్ | 173.4 కోట్లు |
బీస్ట్ తారాగణం & సాంకేతిక నిపుణులు
విజయ్ మరియు పూజ హెగ్డే ప్రధాన పాత్రధారులుగా, సెల్వ రాఘవన్, యోగి బాబు, అపర్ణ దాస్ మరియు తదితరులు నటించగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు,మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందించారు, అనిరుద్ రవి చంద్రన్ సంగీతాన్ని సమకూర్చగా, సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | బీస్ట్ |
దర్శకుడు | దిలీప్ కుమార్ |
నటీనటులు | విజయ్ , పూజ హెగ్డే , సెల్వ రాఘవన్, యోగి బాబు, అపర్ణ దాస్ |
నిర్మాతలు | సన్ పిక్చర్స్ |
సంగీతం | అనిరుద్ రవి చంద్రన్ |
సినిమాటోగ్రఫీ | మనోజ్ పరమహంస |
బీస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్( Beast Pre Release Business)
బీస్ట్, విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మంచి వసూళ్లతో దూసుకపోతుంది, అయితే మొదటి రోజే ఈ చిత్రం 7.4 కోట్ల వసూళ్లని రాబట్టింది, అయితే బీస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది అని అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీస్ట్ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 15 కోట్ల కు జరిగింది, ఈ కోట్లు డిజిటల్ రైట్స్ తో కలిపి, అయితే ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో నిర్మాతల రాబడిని సులువుగా రాబడుతుందని అంచనా.
డిస్క్లైమర్: మేము పైన అందించిన సమాచారం అంతా ఒక అంచనా మాత్రమే మరియు ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు. మేము ఇచ్చిన సంఖ్యలకు ఎటువంటి ప్రామాణికతను ఇవ్వము. కానీ మేము మీకు అందించిన వివరాలన్నీ బాగా తెలిసిన సమాచారం నుండి తీసుకోబడ్డాయి. మేము మీకు నిజమైన సమాచారాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేసాము, అయితే మేము దానికి ప్రామాణికతను ఇవ్వము.