Ante Sundaraniki Telugu Movie Review: అంటే సుందరానికి తెలుగు మూవీ రివ్యూ

Ante Sundaraniki Telugu Movie Review: విలక్షణ నటుడు నాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం, అంటే సుందరానికి కొన్ని రోజులుగా చాలా బజ్ క్రియేట్ చేయబడింది, ఎందుకంటే నాని ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తాడు మరియు అందులో అంటే సుందరానికి ఒకటి , అయితే, ఎట్టకేలకు జూన్ 10, 2022 థియేటర్లలో విడుదలైంది. మరియు ప్రేక్షకులు ఈ కామెడీ చిత్రాన్ని థియేటర్‌లలొ ఆస్వాదిస్తున్నారు, అయితే ఈ చిత్రం ఎలా ఉంది మరియు చూడదగినదా కాదా అని ఈ రివ్యూ లొ తెలుసుకుందాం.

Ante Sundaraniki Telugu Movie Review

 

కథ

సుందర్ ప్రసాద్(నాని) సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు మరియు అతను కుటుంబానికి ఏకైక వారసుడు కానీ సుందర్ కుటుంబం వారి గుడ్డి నమ్మకాలు మరియు సంప్రదాయాలతో అతనిని చిత్రహింసలకు గురిచేస్తుంది, ఒక రోజు సుందర్ అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ అతని జాతకరీత్యా అతనికి అడ్డంకులు ఉన్నాయని కుటుంబం తిరస్కరిస్తుంది, ఇంతలో అతను ఫోటోగ్రాఫర్ అయిన లీలా థామస్ (నజ్రియా)ని చూసి ప్రేమలో పడతాడు అయితే సుందర్ హిందూ కుటుంబానికి మరియు లీల క్రిస్టియన్ కుటుంబానికి చెందడం వల్ల సమస్యలు మొదలవుతాయి, అయితే ఇటు సుందర్ కుటుంబం లీలా ని కోడలిగా ఒప్పుకోరు అదే విధంగా లీలా కుటుంబం కూడా సుందర్‌ను అల్లుడుగా అంగీకరించదు, ఇక వేరే దారి లేక సుందర్ మరియు లీలా థామస్ ఒక ప్లాన్ వేస్తారు, అయితే అది మీరు ఊహించని విధంగా
ఉంటుంది చివరగా, అది ఏంటి అని మీరు సినిమా చూడాల్సిందే.

అంటే సుందరానికి మూవీ నటీనటులు

నాని, నజ్రియా, నరేష్, రోహిణి, నదియా, ఎన్. అలగన్ పెరుమాళ్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, అరుణ భిక్షు, తన్వి రామ్, శ్రీకాంత్ అయ్యంగార్, విన్నీ, హారిక మరియు నోమినా నటీనటులు మరియు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన చిత్రానికి ఛాయాగ్రహణం, నికేత్ బొమ్మి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

సినిమా పేరుఅంటే సుందరానికి
దర్శకుడువివేక్ ఆత్రేయ
నటీనటులునాని, నజ్రియా, నరేష్, రోహిణి, నదియా, ఎన్. అలగన్ పెరుమాళ్, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, అరుణ భిక్షు, తన్వి రామ్, శ్రీకాంత్ అయ్యంగార్, విన్నీ, హారిక మరియు నోమినా
నిర్మాతలుమైత్రీ మూవీ మేకర్స్
సంగీతంవివేక్ సాగర్
సినిమాటోగ్రఫీనికేత్ బొమ్మి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

అంటే సుందరానికి సినిమా ఎలా ఉందంటే?

కామెడీ అయినా, యాక్షన్ అయినా నాని తనదైన శైలిలో తనదైన నటనతో మెప్పిస్తాడు, కామెడీ చిత్రాలకు అతని డైలాగ్ డెలివరీ, కామిక్ టైమింగ్ కి నాని పెట్టింది పేరు అయితే నాని గతంలో ‘వి’ మరియు టక్ జగదీష్ వంటి కొన్ని యాక్షన్ చిత్రాలను ప్రయత్నించాడు, కానీ అవి యావరేజ్‌గా మిగిలిపోయాయి, ఇప్పుడు అతను అంటే సుందరానికి అనే ఈ చిత్రంతో తనకు అలవాటైన కామెడీ తో మన ముందుకొచ్చాడు సినిమా గురించి మాట్లాడుకుంటే, సూపర్బ్ అని చెప్పాలి. ఇటీవ‌ల కాలంలో ప‌రిశ్ర‌మ‌ల‌లో ఒక క్లీన్ కామెడీ ఫిల్మ్, ఇంతవరకు రాలేదు కొన్ని క‌థ‌నంలో లోపాలు ఉన్న‌ప్ప‌టికీ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్తుంది.

కులాంతర వివాహాల నేపధ్యంలో మనం చాలా సినిమాలే చూసాం కానీ ఆ సినిమాలన్నీ సీరియస్‌గా డీల్ డీల్ చేయబడ్డాయి , అంటే సుందరానికి కామిక్‌గా డీల్ చేయబడింది మరియు మరీ ముఖ్యంగా ఈ కులాంతర వివాహం అనేది సినిమాలో ఒక చిన్న పాయింట్ మాత్రమే మీరు ఊహించని ప్రధాన అంశం వేరే ఉంది.

ఫస్ట్ హాఫ్ బ్యూటీఫుల్ కామెడీతో సాగిపోతుంది, సెకండ్ హాఫ్ కూడా అలాగే కొనసాగుతుంది, అయితే ప్రీ-క్లైమాక్స్ ఎమోషనల్ యాంగిల్‌లోకి మారి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరియు క్లైమాక్స్ కూడా కూల్‌గా ఉంది కానీ ఇంకా బాగుండాల్సింది.

సుందర్ ప్రసాద్‌గా నాని చంపేశాడు, ప్రతి సినిమాలో తన పాత్రను న్యాయం చేస్తాడు , అంటే సుందరానికి సంప్రదాయ బ్రాహ్మణ కుర్రాడిగా పర్ఫెక్ట్ చేసాడు, మరో అద్భుతమైన పాత్ర లీలా థామస్, నజ్రియా కి ఇది తెలుగు లో తొలి చిత్రం అయినా చాల బాగా నటించింది ఆమె తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి పేరుగాంచింది మరియు ఈ సినిమాలో కూడా ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి ఆసక్తికరంగా ఆమె లీలా క్యారెక్టర్‌కి తన వాయిస్‌ని ఇచ్చింది మరియు నాని తండ్రిగా నరేష్ చాలా బాగా చేసాడు మరియు శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి మరియు ఇతరులు తమ వంతు పాత్రను పోషించారు.

వివేక్ ఆత్రేయ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అద్భుతమైన రచయితలలో ఒకరు, ఎందుకంటే అతని రచనలలో ఎల్లప్పుడూ తెలుగుదనం ప్రతిబింబిస్తుంది, మరియు మెంటల్ మదిలో నుండి ఇప్పటివరకు అంటే సుందరానికి సినిమా వరకు , అయితే, అతను అంటే సుందరానికి అద్భుతంమైన పాత్రలను వ్రాసాడు అయితే అన్ని పాత్రలకి ప్రాముఖ్యత ఇస్తూ రాయడం అంత సులువు కాదు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్‌ని హర్ట్ చేయకుండా చాలా అద్భుతంగా డీల్ చేశాడు.

సాంకేతికంగా అంటే సుందరానికి బాగుంది నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, రెండు విభిన్నమైన విజువల్స్ మనం చూడవచ్చు, సుందర్ ప్రపంచం ఒకలాగా ఉంటుంది మరియు లీలా ప్రపంచం ఒలాగా కనిపిస్తుంది మరియు మరియు వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన వివేక్ ఆత్రేయ చిత్రాలకు ఎప్పుడు మంచి సంగితం ఇస్తాడు మరియు అంటే సుందరానికి కూడా అతను అద్భుతమైన సంగీతం ఇచ్చాడు మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు బాగా చేసారు. చివరగా, అంటే సుందరానికి ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం, కడుపుబ్బా నవ్వుకోవాలంటే తప్పక చూడాల్సిన చిత్రం.

సినిమా రేటింగ్: 4/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు