Bimbisara Movie Review: బింబిసార మూవీ రివ్యూ

Bimbisara Movie Review: కళ్యాణ్ రామ్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ తీసే హీరో గా పేరు తెచ్చుకున్నాడు, అయితే, అతను మొదటిసారిగా ‘బింబిసార’ అనే సోషియో-ఫాంటసీ చిత్రం చేస్తున్నందు వల్ల అందులోను కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ లేని అవతార్‌లో కనిపించడంతో చిత్రం కి భారీ అంచనాలు నెలకొన్నాయి, అయితే ఈ చిత్రం ట్రైలర్‌తో ఇంకా అంచనాలను పెంచింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ఆగష్టు 05, 2022న విడుదలైంది, ఈ చిత్రానికి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి స్పందన లభిస్తోంది కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా లోతైన సమీక్షను పరిశీలించి, మరియు సినిమా చూడదగినదా కాదా అని తెలుసుకుందాం .

Bimbisara Movie Review

కథ

బింబిసార రెండు టైమ్‌లైన్‌లలో నడుస్తుంది, బింబిసార అనే గొప్ప చక్రవర్తి తనను తాను దేవుడిగా మరియు రాక్షసుడిగా ప్రకటించుకుని త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అయితే అతను ప్రపంచాన్ని జయించాలని నిర్ణయించుకుని యుద్హం లొ దిగుతాడు, మరొక ప్రపంచంలో ఒక వ్యక్తి అచ్చం బింబిసారుడిలా కనిపిస్తాడు, అక్కడ కొంత మంది దుండగులు కారణం లేకుండా అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అయితే, తరువాత అతను బింబిసార నిధిని తెరవగల ఏకైక వ్యక్తి అని తెలుసుకుంటాడు, చివరగా,అసలు ఈ రెండు ప్రపంచాలు ఎలా ఢీకొంటాయి అనేది మిగిలిన కథ.

బింబిసార మూవీ నటీనటులు

నందమూరి కళ్యాణ్‌రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్, వెన్నెల, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా, ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వశిష్ట, సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు, సంగీతం: M. M. కీరవాణి, ఎడిటర్: తమ్మి రాజు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె నిర్మించిన చిత్రం.

సినిమా పేరుబింబిసార
దర్శకుడువశిష్ట
నటీనటులునందమూరి కళ్యాణ్‌రామ్, కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వారినా హుస్సేన్, వెన్నెల, ప్రకాష్ రాజ్
నిర్మాతలుహరికృష్ణ కె
సంగీతంM. M. కీరవాణి
సినిమాటోగ్రఫీఛోటా కె. నాయుడు
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

బింబిసార సినిమా ఎలా ఉందంటే?

తెలుగు ప్రేక్షకులకు సోషియో ఫాంటసీ సినిమాలు కొత్త కాదు సీనియర్ ఎన్టీఆర్ కాలం నుండి బాహుబలి వరకు , మనం చాలా సోషియో-ఫాంటసీ చిత్రాలను చూశాము, అయితే బింబిసారా లొ కొత్తగా అనిపించేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, ఇది మాములు టైం ట్రావెల్ ల కాకుండా, ఈ కథ సమాంతర ప్రపంచంలో నడుస్తుంది, ఇక్కడ రెండు టైమ్‌లైన్‌లతో సంబంధం లేదు, కానీ దర్శకుడు దానిని ఎలా కనెక్ట్ చేసాడుఅనేది మీరు థియేటర్‌లలో చూసి తెల్సు కోవాలి.

ఈ చిత్రం సాలిడ్ యాక్షన్ బ్లాక్‌తో బాగా మొదలవుతుంది మరియు అది బింబిసార ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, తర్వాత బింబిసార క్రూరత్వాన్ని చూపించడానికి దాదాపు 30 నిమిషాలు తీసుకుంటాడు దర్శకుడు, అయితే, సినిమా మొదటి సగం బింబిసారగా కళ్యాణ్ రామ్ నటనతో మరియు కొన్ని యాక్షన్ బ్లాక్‌లతో సాగిపోతుంది మరియు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ తరువాత సగం హైదరాబాద్‌లోకి షిఫ్ట్‌ అయ్యి ప్రారంభంలో ఫ్లాట్‌గా నడుస్తున్న కథ, బింబిసారని పోలి ఉన్న వ్యక్తి లోకి బింబిసారా ఆవహించిన దగ్గర్నుంచి క్లైమాక్స్ వరికి ప్రస్తుత ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.

బింబిసార ప్రత్యేకమైన కథ లేదు, అయితే ఒక కొత్త ప్రపంచం మరియు కళ్యాణ్ రామ్ నెగెటివ్ షేడ్స్ సినిమా మొత్తం చూడాలనే ఆసక్తిని కలిగిస్తాయి, అయితే ఈ చిత్రం లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రేమకథ సరిగ్గా రాకపోవడం మరియు కొన్ని పాటలను బలవంతంగా స్క్రీన్ ప్లేలో జొప్పించడం మరియు కొన్ని లాజిక్‌లు కూడా పట్టించు కోకపోవడం ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్యాణ్ రామ్ చక్కటి నటనతో మరియు కొన్ని ట్విస్ట్‌లతో నిమగ్నమవడం వల్ల అవేం అంత లోపల్లాగా అనిపించవు .

కళ్యాణ్ రామ్ రెండు పాత్రలలో అద్భుతంగా నటించాడు, పాత్ర కోసం అతని పరివర్తనకు మెచ్చుకోవాలి మరియు డైలాగ్ డెలివరీలో అతను అద్భుతంగా చేసాడు బింబిసారలో అద్భుతమైన తారాగణం ఉంది, అయితే విశ్వానందన్ వర్మ (ప్రకాష్ రాజ్) పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఈ సంక్లిష్టమైన కథను తెరపైకి తెచ్చినందుకు దర్శకుడు వశిష్టకు అభినందనలు, అతను ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు, అయినప్పటికీ, అతను పాపా పాత్రను రాయడంపై మరింత దృష్టి పెట్టాల్సింది.

సాంకేతికంగా బింబిసార గ్రాండియర్ గ ఉంటుంది చోటా కె నాయుడు యొక్క విజువల్స్ బాగున్నప్పటికీ , చాలా సన్నివేశాలు హెవీ కలర్ టోన్ తో ఉంటాయి మరియు M.M. కీరవాణి పాటలు అంతగా లేవు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తన అనుభవాన్ని చూపించాడు మరియు మిగిలిన విభాగాలు తమ సత్తా చాటారు.

చివరగా, బింబిసార అనేది అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే మంచి సోషియో-ఫాంటసీ చిత్రం.

సినిమా రేటింగ్: 3.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు