The Life of Muthu Movie Review: ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు తెలుగు మూవీ రివ్యూ

The Life of Muthu Movie Review: సిలంబరసన్ టిఆర్ అకా శింబు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితుడు, కానీ కొన్ని సంవత్సరాలుగా మనం అతన్ని తెలుగులో చూడలేదు, అయినప్పటికీ, అతని చివరి చిత్రం మానాడు పెద్ద విజయాన్ని సాధించింది అయితే సోనిలివ్ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసింది.అయితే చాల గ్యాప్‌ తరువాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘వెందు తనింధతు కాదు’ అనే తమిళ డబ్బింగ్ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే ఆసక్తికరమైన చిత్రంతో ఈరోజు సెప్టెంబర్ 15, 2022న చిత్రం తో మన ముందుకొచ్చాడు, ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా లోతైన సమీక్షలోకి వెళ్లి సినిమా చూడదగినదో కాదో తెలుసుకుందాం.

The Life of Muthu Movie Review

కథ

ముత్తు (సిలంబరసన్ TR) అని పిలువబడే ఒక చిన్న కులస్థుడు తన తల్లితో ముంబై అనే నగరానికి వస్తాడు, అక్కడ అతను తన గుర్తింపు కోసం చాలా కష్టాలను ఎదుర్కుంటాడు, చివరికి అతను రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఉద్యోగం పొందుతాడు అయితే అంతా సజావుగా సాగుతుంధీ అనుకునే సమయానికి అతను తన రెస్టారెంట్‌లో ఒక హత్యను చూస్తాడు ఇక అక్కడ నుండి, అతని జీవితం వేరే మలుపు తిరుగుతుంది అనుకోకుండా ముత్హు గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు, చివరకు, అతను ఎలా గ్యాంగ్‌స్టర్ అయ్యాడు? ముత్తు ప్రయాణం ఏమిటన్నది మిగతా కథలో.

ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ నటీనటులు

సిలంబరసన్, సిద్ధి ఇద్నాని, రాధిక శరత్‌కుమార్, సిద్ధిక్, నీరజ్ మాధవ్, ఏంజెలీనా అబ్రహం, ఈ చిత్రానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు సినిమాటోగ్రఫీ సిద్ధార్థ నన్, సంగీతం ఎ.ఆర్.రెహమాన్, నిర్మాత: ఇషారి కె. గణేష్. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుది లైఫ్ ఆఫ్ ముత్తు
దర్శకుడుగౌతమ్ వాసుదేవ్ మీనన్
నటీనటులుసిలంబరసన్, సిద్ధి ఇద్నాని, రాధిక శరత్‌కుమార్, సిద్ధిక్, నీరజ్ మాధవ్, ఏంజెలీనా అబ్రహం
నిర్మాతలుఇషారి కె. గణేష్
సంగీతంఎ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీసిద్ధార్థ నన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ది లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా ఎలా ఉందంటే?

‘గాడ్‌ఫాదర్‌’ సినిమాను రిఫరెన్స్‌గా తీసుకుని అన్ని భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి,అయితే ది లైఫ్ అఫ్ ముత్తు చిత్రం ముత్తు ప్రయాణం, ఇలాంటి కథ తో మనం చాలా సినిమాలు చూశాం, ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలు, ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ఒక గ్యాంగ్‌స్టర్ అవుతాడు మనం లెక్కలేనన్ని చిత్రాలను చూశాము, అయితే కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా మారాయి మరియు గుర్తుండిపోయేల నిలిచాయి అందుకు కారణం బలమైన పాత్రల రూపకల్పన మరియు నిస్సందేహంగా ఈ చిత్రం బలమైన పాత్రల్ని కలిగి ఉంది, కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ మొదటి నుండి పాత్రకి కనెక్ట్ అయ్యే సినిమాని ఎంగేజ్ చేసేలా చేసింది.

ముత్తుని గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేయడం ద్వారా సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది, తరువాత కథ మిమ్మల్ని ముత్తు యొక్క ప్రారంభ రోజులకు తీసుకెళ్తుంది, మొదట్లో కొంచెం సాగతీసినట్టు అనిపించినా కానీ ముత్తు ముంబైలోకి అడుగుపెట్టిన తర్వాత చిత్రం ఆసక్తికరంగా మారుతుంది మరియు ముంబైలో అతను ఎలా కష్టపడ్డాడు, అతను క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు, ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ప్రదర్శించబడ్డాయి, అయితే సినిమాలో దాని లోపాలు కూడా ఉన్నాయ్ మరియు కథ ముందుకు సాగడానికి లవ్ ట్రాక్ ఏమీ సహాయపడదు కాని లవ్ ట్రాక్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అభిమానులకు నచ్చవచ్చు.

ఈ చిత్రం తమిళంలో విజయం సాధించే అవకాశం ఉంది, ఎందుకంటే సినిమా మొత్తం తమిళ నేపధ్యం ఎక్కువుంటుంది తెలుగు ప్రేక్షకులు బలమైన భావోద్వేగాలు మరియు నాన్-సింక్ డబ్బింగ్‌తో సినిమాతో డిస్‌కనెక్ట్ కావచ్చు, ప్రధానంగా వాయిస్ ఓవర్‌తో స్క్రీన్ ప్లే తో.

ముత్తుగా శింబు అద్భుతంగా చేసాడు,ముఖ్యంగా అతని ట్రాన్స్ఫార్మషన్ ని మనం అభినందించాలి, సిద్ధి ఇద్నాని స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఆమె తన లుక్స్‌తో ఆకట్టుకుంది, ముత్తు తల్లిగా రాధికా శరత్ కుమార్ తన అనుభవాన్ని చూపించింది మరియు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ లవ్ స్టోరీలు మరియు పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలను తీయడంలో నిపుణుడు, కానీ అతను మొదటిసారిగా డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, సినిమా అంతటా ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు శింబు, గౌతం వాసుదేవ్, మరియు A.R. రెహమాన్లది విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌ మరియు ఇప్పుడు వారి విజయవంతమైన ట్రాక్ రికార్డ్‌లో ది లైఫ్ ఆఫ్ ముత్తు చేరబోతోంది అందంలో ఎలాంటి సందేహం లేదు.

సాంకేతికంగా, ది లైఫ్ ఆఫ్ ముత్తు అత్యున్నతమైనది సిద్ధార్థ నన్ యొక్క సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన బలం షాట్ కంపోజిషన్ నుండి గ్రేడింగ్ వరకు ప్రతిదీ అద్భుతంగా కనిపిస్తుంది మరియు ఎ.ఆర్ రెహమాన్ ఎప్పటిలాగే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చాలా సన్నివేశాలను ఎలివేట్ చేశాడు. మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు తమ వంతుగా బాగా పనిచేశాయి.

మొత్తంమీద, ది లైఫ్ ఆఫ్ ముత్తు అనేది కొన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా.

ప్లస్ పాయింట్లు:

  • బలమైన పాత్రలు
  • సినిమాటోగ్రఫీ
  • సంగీతం

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ కథాంశం
  • ఎమోషన్స్ ఆకట్టుకునేలా లేకపోవడం

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు