Ponniyin Selvan Telugu Movie Review: పొన్నియిన్ సెల్వన్ తెలుగు మూవీ రివ్యూ

Ponniyin Selvan Telugu Movie Review: పొన్నియిన్ సెల్వన్ చిత్రం కల్కి కృష్ణమూర్తి రాసిన నవలకి అనుసరణ, ఇది 5 సంపుటాలుగా వ్రాయబడింది మరియు ఇది తమిళంలో ఇప్పటివరకు వ్రాసిన గొప్ప నవల అని చెప్పొచ్చు అయినప్పటికీ, నవలలను స్ఫూర్తిగా తీసుకొని చలనచిత్ర గొప్ప దర్శకుల్లో ఒకరైన మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ అనే చిత్రాన్ని రూపొందించారు. అయితే తమిళ్ లో గొప్ప నటులుగా పేరు గాంచిన నటీనటులు ఉండడంతో చాల క్యూరియాసిటీని సృష్టించాయి, వాస్తవం ఏమిటంటే ఈ చిత్రం తమిళంలో చాలా మంచి బజ్ ని సృష్టించింది, అయితే తెలుగు విషయానికి వస్తే సినిమాను ప్రమోట్ చేయడంలో మేకర్స్ పూర్తిగా విఫలమయ్యారు.

Ponniyin Selvan Telugu Movie Review

ఐన కూడా తెలిసిన నటీనటుల ఉండడంతో ఈ చిత్రం కొంత బజ్ ని అయితే సృష్టించినప్పటికీ, అయితే భారీ అంచనాలతో సినిమా ఎట్టకేలకు విడుదలైంది మరియు ఆలస్యం చేయకుండా సినిమా చూడదగ్గదా లేదా అని తెలుసుకుందాం.

కథ

1000 సంవత్సరాల క్రితం జరిగిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంలో , వండియతేవన్ (కార్తీ) క్రౌన్ ప్రిన్స్ ఆదిత కరికాలన్ (విక్రమ్) నుండి ఒక లేఖను అందజేయడానికి చోళ రాజ్యంలో అడుగు పెడ్తాడు, సామంతులు మరియు చిన్న పెద్దలచే ప్రణాళిక చేయబడిన అంతర్యుద్ధం ఉన్నట్లు కనిపించే దేశంలో, కుందవాయి (త్రిష) రాజకీయ ప్రశాంతతను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. చోళ సామ్రాజ్య రక్షకుడైన జయం రవి అరుణ్మోళి వర్మ చోళ రాజ్యాన్ని ఎలా రక్షించగలడు? అసలు నందిని (ఐశ్వర్యరాయ్) ఎవరు? ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, మీరు తప్పక సినిమా చూడాలి.

పొన్నియిన్ సెల్వన్ మూవీ నటీనటులు

విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్ తదితరులు, ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు, సంగీతం AR. రెహమాన్ స్వరపరిచారు, ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేయగా, లైకా ప్రొడక్షన్స్ & మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మించారూ.

సినిమా పేరుదొంగలున్నారు జాగ్రత్త
దర్శకుడుమణిరత్నం
నటీనటులువిక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్
నిర్మాతలులైకా ప్రొడక్షన్స్ & మద్రాస్ టాకీస్
సంగీతంAR. రెహమాన్
సినిమాటోగ్రఫీరవి వర్మన్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

పొన్నియిన్ సెల్వన్ సినిమా ఎలా ఉందంటే?

బాహుబలి వాళ్ళ ఎన్నో దారులు తెరుచుకున్నాయి మరియు కథను చెప్పే విఛ్ధానాన్ని బద్దలు కొట్టిందనడంలో సందేహం లేదు, ఆ నమ్మకంతో చాలా మంది దర్శకనిర్మాతలు యూనివర్సల్ కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నారు, పాపం చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి, అయితే, మొదటిసారి హిస్టారికల్ డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నం, మరియు చాలా మంది గొప్ప నటులు ఈ చిత్రంలో భాగం కావడం చాలా మంది సినీ ప్రేమికులను ఉత్తేజపరిచింది, అయితే సినిమా విషయానికి వస్తే, ఇది స్వచ్ఛమైన తమిళ సినిమా అని చెప్పక తప్పట్లేదు ఎందుకంటే తమిళ ప్రజలు కాకుండా, వేరే రాష్ట్రాల ప్రేక్షకులు వారి భాషలో చూస్తున్న వారు సినిమాతో మరియు పాత్రలతో డిస్‌కనెక్ట్ అయ్యే స్కోప్ చాల ఉంది, ఎందుకంటే చోళ చరిత్ర గురించి వాళ్ళకి తేలికపోవడం .
చోళ చరిత్రను పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా మొదలై, అన్ని కీలక పాత్రలను స్థాపించిన తర్వాత బోరింగ్ డ్రామాతో సినిమా ట్రాక్‌ను కోల్పోతుంది, వంద్యతేవన్ (కార్తీ) వచ్చాక సినిమా ఆసక్తికరంగా మారి ఆ ఉత్సుకతను ఇంటర్వెల్ వరకు ఉంచడంలో మేకర్స్ విజయం సాధించారు, సెకండాఫ్ భారీ భావోద్వేగాలపై నడుస్తుంది మరియు వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది కూడా, అయితే, పొన్నియిన్ సెల్వన్‌కు అన్నీ ఉన్నాయి కానీ చూస్తున్నప్పుడు మనకు ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది, దానికి కారణం నాకనిపించింది ఏంటంటే ప్రేక్షకులకి చోళ చరిత్రతో సంబంధం లేకపోవడం.

ఈ చిత్రం నిస్సందేహంగా ఒక విజువల్ ట్రీట్ అయితే తమిళ ప్రేక్షకులు కాకుండా ప్రేక్షకులు మిగతా వాళ్లు నాన్-సింక్ డబ్బింగ్ మరియు నేటివిటీతో చాలా సమస్యలను ఎదుర్కొంటారు, అయితే చోళ రాజవంశం యొక్క చరిత్ర మీకు తెలిస్తే చిత్రం కొంతమేరకు నచ్చే అవకాశం ఉంది .

ఈ రకమైన భారీ సబ్జెక్ట్ కాస్టింగ్ కీలకం అవుతుంది, ఆదిత కరికాలన్‌గా విక్రమ్ అద్భుతంగా నటించాడు, వంద్యతేవన్‌గా కర్హి పాత్ర యొక్క కామిక్ బాడీ లాంగ్వేజ్ యుగనికి ఒక్కడు లాగా బాగుంది, అరుణ్‌మొళి వర్మగా జయం రవికి స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితం అయినప్పటికీ అతని పాత్ర చాలా బాగా రాసుకున్నరు మరియు త్రిష కుందవిగా, నందినిగా ఐశ్వర్య మరియు అన్ని పాత్రలు తమ వంతుగా బాగా చేసారు.

పాత్రల నుండి ఇంటెన్స్ డ్రామా తీసుకురావడంలో మాస్టర్ అయిన మణిరత్నం, పొన్నియిన్ సెలవన్‌లో చాలా నాటకీయత ఉంది, అయితే ఆ డ్రామా అంతగా కనెక్ట్ కాలేదు మరియు అతను ఇంటెన్స్ డ్రామా ని తీయడంలో విఫలమయ్యాడు మరియు ఇది మణిరత్నం తరహా చిత్రం కాదు.

కొన్ని VFX షాట్‌లు మినహా, సాంకేతికంగా, పొన్నియన్ సెల్వన్ బాగుంది మరియు చిత్రానికి అతిపెద్ద వెన్నెముక AR. రెహమాన్ అతని పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి, రవి వర్మన్ సినిమాటోగ్రఫీ బాగుంది, మిగిలిన సాంకేతిక బృందం తమ సత్తా చాటింది.

ఓవరాల్‌గా, పొన్నియన్ సెలవ్న్ అనేది చోళ రాజ్య చరిత్ర గురించి తెలుసుకుంటే స్క్రీన్‌పై చూడడానికి ఒక ట్రీట్‌గా ఉంటుంది.

ప్లస్ పాయింట్లు:

  • తారాగణం
  • ప్రదర్శనలు
  • సంగీతం

మైనస్ పాయింట్లు:

  • నేటివిటీ

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు