Pushpa Movie First Review: మోస్ట్ అవైటింగ్ మీవీ ఆఫ్ ద ఇయర్ పుష్ప థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఆడియెన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినమా రీచ్ అవడంతో మంచి టాక్ వినిపిస్తుంది. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఆ మెత్తాన్ని ప్రీ రిజీజ్ బిజినెస్ లోనే రాబట్టుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి థియేటర్ల ముందు మామూలుగా లేదు. రెండు రాష్ట్రల్లో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
కథ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ ఫాత్రలో పూర్తిగా లీనమయ్యారు. పోలీసులు అల్లు అర్జున్ ను పట్లుకుంటారు. స్మగ్లింగ్ గురించి అడిగితే తన బాస్ పుష్ప గురించి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. శేషాచలం అడవుల్లో నుంచి వేల కోట్ల విలువ చేసే ఎర్రచెందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తారు. ఆ గ్యాంగ్ కి పుష్ప ఎలా నాయకత్వం వహిస్తాడనే దాని చుట్లే కథ మెత్తం తిరుగుతుంది. ఎర్రచెందనం స్మగ్లింగ్ గురించి చాలామందే వినుంటారు కానీ డైరెక్టర్ సుకుమార్ ఈ స్మగ్లింగ్ గురించిన వివరాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన అద్భతంగా తెరకెక్కించారు.
ఎప్పుడు మాడరన్ క్యూట్ లుక్ తో కనిపించే రష్మిక ఈ సినిమాలో ఊరి పిల్లగా అదరకొట్టింది. బాడీ ల్యాంగ్వేజ్, ఎక్స్ ప్రెషన్ క్యారెక్టర్ కి తగ్గట్టుగా చేసింది. సమంత ఐటం సాంగ్ పడగానే థియేటర్లలో ఫ్యాన్స్ అల్లరి మామూలుగా లేదు. సమంత పర్ఫామెన్స్ కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఇక విలన్ గా సునిల్, పోలీస్ ఆఫీసర్ గా ఫహాద్ ఫాసిల్, నెగటివ్ రోల్ లో అనసూయ యాక్టింగ్ వారి కెరీర్ లో నిలిచిపోతుంది. ఫహాద్ ఫాసల్, అల్లు అర్జున్ కలిసి నటించిన ఈ సినిమా మళయాలీ అల్లు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పుకోవచ్చు.
డిఎస్పీ మ్యూజిక్, శ్రీకాంత్ విస్సా స్కీన్ ప్లే డైలాగ్స్, హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ మిరోస్ల కుబ బ్రోజెక్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్లస్ అయింది. మొత్తం 179 నిమిశాల నిడివితో ఉండే ఈ సినిమాను అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.
మూవీ రేటింగ్: 3.5/5
Also read:
- ఈ వారం విడుదలవుతున్న సినిమాలు
- Kurup OTT విడుదల తేదీ
- Kurup Streaming on Netflix: నెట్ఫ్లిక్స్లో కురుప్ స్ట్రీమింగ్
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్