Writer Padmabhushan Telugu Movie Review: ఇప్పుడున్న యువ నటుల్లో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ ప్రత్యేకమైన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కలర్ ఫోటో తో హీరో గా ఎంట్రీ ఇచ్చి, ఫామిలీ డ్రామా అనే చిత్రంతో తనలోని నటనని బయటికి తీసాడు,రీసెంట్ గా హిట్ 2 లో అద్భుతమైన నటనతో మెప్పించిన సుహాస్ ఇప్పుడు రైటర్ పద్మభూషన్ అనే కామెడీ డ్రామా తో మన ముందుకొచ్చాడు, అయితే ఈరోజు విడుదలైన చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
విజయవాడ లో పద్మ భూషన్(సుహాస్) ఒక లైబ్రరీ లో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేస్తూ ఉంటాడు, అతను ఒక అమ్మాయితో ప్రేమలో కూడా ఉంటాడు, అయితే పద్మభూషన్ కి రైటర్ అవ్వాలని, ఒక బుక్ ని పబ్లిష్ చేయాలనీ కోరిక, కానీ దానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో, 3 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని మరి ఒక బుక్ ని పబ్లిష్ చేస్తాడు కానీ ఆ బుక్ ని ఎవరు చదవరు దీంతో దాన్ని సేల్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటాడు, ఇంతలో తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవతుంది, అయితే ఇక్కడే పధ్మాభూషణ్ ఒక నిజాన్ని దాచాడని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది, చివరికి ఆ నిజం ఏంటి ? అనేది చిత్రం లో చూసి తెలుసు కోవాలి.
రైటర్ పద్మభూషణ్ మూవీ నటీనటులు
సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు నటించగా, షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, ఛాయాగ్రహణం వెంకట్ ఆర్ శాకమూరి అందించగా శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు,ఇక సిద్ధార్థ తాతోలు ఎడిటర్, నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైన్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
సినిమా పేరు | రైటర్ పద్మభూషణ్ |
దర్శకుడు | షణ్ముఖ ప్రశాంత్ |
నటీనటులు | సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి తదితరులు |
నిర్మాతలు | చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్ |
సంగీతం | శేఖర్ చంద్ర |
సినిమాటోగ్రఫీ | వెంకట్ ఆర్ శాకమూరి |
ఓటీటీ రిలీజ్ డేట్ | ధ్రువీకరించలేదు |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | ధ్రువీకరించలేదు |
రైటర్ పద్మభూషణ్ సినిమా ఎలా ఉందంటే?
ఈ చిత్రం ముఖ్య పాత్రల పరిచయంతో స్లో గా ప్రారంభం అయినప్పటికీ, ఎప్పుడిదైతే సుహాస్ ఎంట్రీ తో మొదటి సగం మంచి కామెడీ తో, హీరో మరియు హీరోయిన్ లవ్ ట్రాక్ తో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో కథనం కొంచెం గాడి తప్పిన, ఎప్పుడైతే సహసా దాచిన నిజం తెలిసాక కథనం మంచి కామెడీ తో చివరి వరకు నవ్విస్తుంది, కథ ఎలా ఉన్న సినిమాకి వెన్నెముక సుహాస్ మరియు కామెడీ.
ఇక సుహాస్ పధ్మాభూషణ్ గా అద్భుతంగా నటించాడు, ఒక మధ్యతరగతి అబ్బాయిగా మంచి ఎక్స్ప్రెషన్స్ తో మనలని నవ్విస్తాడు, ఇక టీనా శిల్పారాజ్ ఉన్నంతలో బాగా చేసింది, మధ్య తరగతి ఫాదర్ గా ఆశిష్ విద్యార్ధి మరియు అమ్మగా రోహిణి అద్భుతంగా నటించారు, ఇక మిగిలిన తారాగణం వారి పాత్రల మేరకు బాగానే చేసారు.
షణ్ముఖ్ ప్రశాంత్ తన మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు, కథ మామూలుగు ఉన్నప్పటికీ, మంచి కథనం కామెడీ మరియు అద్భుతమైన పత్రాల రూపకల్పన తో ప్రేక్షకులని ఎంగేజ్ చేయడంలో విజయం సాధించాడు. టెక్నికల్‌గా చిత్రం పర్వాలేదు, వెంకట్ ఆర్ శకుమారి ఛాయాగ్రహణం పర్వాలేదు, ఇక శేఖర్ చంద్ర పాటలు అంతగా ఆకట్టుకోలేదు కానీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు.
చివరగా, రైటర్ పద్మభూషన్ మంచి కామెడీ డ్రామా మరియు అన్ని రకాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం.
ప్లస్ పాయింట్లు:
- కామెడీ
- సుహాస్ నటన
- ఆశిష్ విద్యార్థి మరియు రోహిణి
మైనస్ పాయింట్లు:
- సింపుల్ స్టోరీ
- ఎమోషన్ లేకపోవడం
సినిమా రేటింగ్: 3/5
ఇవి కూడా చుడండి:
Waltair Veerayya Box Office Collections: వాల్తేరు వీరయ్య బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
Hunt Box Office Collections: హంట్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
Hunt Telugu Movie Review: హంట్ తెలుగు మూవీ రివ్యూ