Ramabanam Movie Review: రామబాణం మూవీ రివ్యూ

Ramabanam Telugu Review: యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరు మన గోపీచంద్, విలన్ గా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్, ఆ తరువాత తొలివలపు తో హీరో గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఇక విజయాలతో, పరాజయాలతో సంబంధం లేకుండా చిత్రాన్ని చేస్తున్న గోపీచంద్, ఈసారి, లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలు చేసిన శ్రీవాస్ తో మూడోసారి రామబాణం అనే చిత్రం తో మన ముందొకొచ్చాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Ramabanam Movie Review

కథ

రామ్(గోపీచంద్ ) తన అన్న సుఖీభవ అనే హోటల్ ని స్వచ్ఛమైన, ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించిన వాటితో నడిపిస్తూ ఉంటారు. రామ్ తన అన్నకి సహాయంగా ఉంటాడు, అయితే అనుకోకుండా తన అన్న చనిపోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. ఇక దీని వెనక ఎవరున్నారు తెలుసుకోవడం మొదలు పెడ్తాడు రామ్ . చివరికి ఎం జరిగింది అనేది మిగతా కథ.

రామబాణం మూవీ నటీనటులు

గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీవాస్, మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వెట్రి పళనిసామి ఛాయాగ్రాణం, ఇక ఈ చిత్రాన్ని టి జి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.

సినిమా పేరురామబాణం
దర్శకుడుశ్రీవాస్
నటీనటులుగోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తదితరులు
నిర్మాతలుటి జి విశ్వ ప్రసాద్
సంగీతంమిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీవెట్రి పళనిసామి
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

రామబాణం సినిమా ఎలా ఉందంటే?

శ్రీవాస్ మరియు గోపీచంద్ కంబినేషన్ లో వచ్చిన లక్ష్యం తప్ప, లౌక్యం గాని, ఆ తరువాత గోపీచంద్ వేరే దర్శకులతో తీసిన సౌఖ్యం ఇలా అన్ని ఒకే రకమైన ఫార్మాట్ లో ఉంటాయి. ఇక రామబాణం కూడా అదే కోవలోకి చెందుతుంది. సినిమా మొత్తమ్ లౌక్యం ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి తప్ప ఎక్కడ కొత్తదనం అనేది కనిపించదు.

అయితే చిత్రం ఎలా ఉన్నప్పటికీ, గోపీచంద్ అభిమానులకి మరియు మాస్ ప్రేక్షకులకి నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయ్, ఇక అదే విధంగా కామెడీ కూడా బాగానే ఎంగేజ్ చేసింది, ఇక ఫామిలీ ప్రేక్షకులకి నచ్చే అంశాలు కూడా చాలానే ఉన్నాయ్. ఇలా అన్ని వర్గాల వారికీ నచ్చే విధంగా ఈ చిత్రాన్ని ప్రెసెంట్ చేసారు, అయితే కొత్తదనాన్ని కోరుకుఇని వారికీ ఈ చిత్రం నిరపరుస్తుంది.

ఇక గోపీచంద్ తాను ఎప్పుడు చేసిన పాత్రే అవ్వడం వాళ్ళ బాగానే చేస్కుంటూ వెళ్ళిపోయాడు, కానీ తన నటనలో కొత్తగా ఏమి కనిపించదు. డింపుల్ హయతి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా తన గ్లామర్ తో మెప్పించింది, ఇక జగపతి బాబు, గెట్ అప్ శ్రీను, ఖుష్బూ, సప్తగిరి, వెన్నెల కిషోర్ ఇక చాల నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

శ్రీవాస్ పాత కథతో వచ్చిన, అన్ని అంశాలను అన్ని వర్గాలకి నచ్చే విధంగా బాగా పొందుపరిచాడు మరియు అది తెర పై బాగా ప్రెసెంట్ చేసాడు కూడా.

సాంకేతికంగా రామబాణం చాల బాగుందని, ఇక వెట్రి పళనిసామి చాయాగ్రహణం ఒక కమర్షియల్ చిత్రానికి ఎలా కావాలో ఆలా ఉంది, మిక్కీ జె మేయర్ పాటలు పర్వాలేదు కానీ నేపధ్య సంగీతం ఇంకా బాగుండాల్సింది.

మొత్తం మీద రామబాణం అన్ని వర్గాలకి నచ్చే అంశాలు ఉన్న రెగ్యులర్ కమర్షియల్ చిత్రం

ప్లస్ పాయింట్లు:

  • కామెడీ
  •  యాక్షన్

మైనస్ పాయింట్లు:

  • ఉహించదగిన కథనం

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు