Dead Pixels Web Series Review: డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ

Dead Pixels Web Series Review: డెడ్ పిక్సల్స్ యుకె లో చాల పేరుగాంచిన వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు దాన్ని తెలుగు లోకి అడాప్ట్ చేసి రిలీజ్ చేసారు. నిహారిక, హర్ష, సాయి రోనాక్ తదితరులు నటించిన ఈ సిరీస్ ఈరోజు హాట్ స్టార్ లో విడుదలయింది. ట్రైలర్ అయితే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Dead Pixels Web Series Review

కథ

గాయత్రి (నిహారిక కొణిదెల), భార్గవ్ (అక్షయ్ లగుసాని), ఆనంద్ (వివా హర్ష), మరియు రోషన్ (సాయి రోనక్) మంచి స్నేహితులు, వేరే వేరే జాబ్ లు చేస్తూ ఉంటారు కానీ డెడ్ పిక్సల్స్ అనే గేమ్ వాళ్ళ జీవితాల కంటే ఎక్కువ అని బతికేస్తుంటారు. అయితే ఈ నలుగురు గేమ్ లో ఎలాగయినా గెలవాలని ఎలాంటి క్రేజీ పనులు చేసారు అనేది మీరు ఈ సిరీస్ చూసి తెల్సుకోవాలి.

డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ నటీనటులు

నిహారిక కొణిదెల, అక్షయ్ లగుసాని, హర్ష చెముడు, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, జయశ్రీ రాచకొండ మరియు తదితరులు. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి , ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రాఫర్, సిద్ధార్థ సదాశివుని సంగీతం, సృజన అడుసుమిల్లి ఎడిటర్ మరియు ఈ సిరీస్‌ని బిబిసి స్టూడియోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు తమడ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్నాయి.

వెబ్ సిరీస్ పేరుడెడ్ పిక్సల్స్
దర్శకుడుఆదిత్య మండల
నటీనటులునిహారిక కొణిదెల, అక్షయ్ లగుసాని, హర్ష చెముడు, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, తదితరులు
నిర్మాతలుబిబిసి స్టూడియోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు తమడ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
సంగీతంసిద్ధార్థ సదాశివుని
సినిమాటోగ్రఫీఫహద్ అబ్దుల్ మజీద్
ఓటీటీ రిలీజ్ డేట్మే 19 2023
ఓటీటీ ప్లాట్ ఫార్మ్హాట్ స్టార్

డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

డెడ్ పిక్సల్స్ హిట్ అవ్వడానికి మెయిన్ కారణం గేమ్ నేపధ్యం లో తీయడం, అయితే ఇది యూనివర్సల్ సబ్జెక్టు , తెలుగులోనే కాదు ఏ లాంగ్వేజ్ లో తీసిన కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయో కాబట్టి. ఈ డెడ్ పిక్సల్స్ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మొదటి ఎపిసోడ్ లో అన్ని పాత్రల పరిచయం అయ్యాక రెండవ ఎపిసోడ్ నుండి, ఈ నలుగురి పర్సనల్ జీవితాలు, వారి ఎలా గేమ్ కి అడిక్ట్ అయ్యి మరి బతుకుతున్నారు అనే అంశాలని కామెడీ గా చూపిస్తూనే, దాని వల్ల కుటుంబం ఎలా బాధపడుతుంది అనే పాయింట్ ని చాల బాగా అడ్రెస్స్ చేశారు. కచ్చితంగా గేమ్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ చూసాక ఒక ఆలోచన అయితే బ్రెయిన్ లో కలుగుతుంది.

గాయత్రీ గా నిహారిక పర్వాలేదన్పించింది, ఇక వైవా హర్ష తన కామెడీ ఎప్పట్లాగే నవ్వించాడు, రోషన్ గా సాయి రోనాక్ పర్వాలేదు, భార్గవ్ గా అక్షయ్ లగుసాని బాగా చేసాడు, ఇక మిగిలిన నటి నటులు తమ పాత్రల మేరకు బాగానే చేసారు.

సిరీస్ లో పెద్ద ఎక్సయిటింగ్ అంశాలు లేవు కానీ అందరిని ఆకట్టుకునే గేమ్ అనే అంశాన్ని ఆదిత్య మండల తెలుగు లోకి చాల బాగా అడాప్ట్ చేసాడు. తాను ఎం చెప్పాలి అనుకున్నాడో అది స్పష్టానంగా చెప్పాడు కానీ సిరీస్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటె చూసే ప్రేక్షకుడికి ఇంకా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉండేది. ఏది ఏమైనా ఆదిత్య మండల ప్రేక్షకులని ఎంగేజ్ చేయడం లో విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా డెడ్ పిక్సల్స్ , బాగుంది ఫహద్ అబ్దుల్ మజీద్ ఛాయాగ్రహణం పర్వాలేదు,సిద్ధార్థ సదాశివుని సంగీతం కూడా పర్వాలేదు, ఇక మిగిలిన సాంకేతిక నిపుణులు తమ వంతు కృషి చేసారు.

ఓవర్ అల్ గా, డెడ్ పిక్సల్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన మస్ట్ వాచ్ వెబ్ సిరీస్

ప్లస్ పాయింట్లు:

  • సిరీస్ నేపధ్యం
  • కొన్ని ఎపిసోడ్ లు

మైనస్ పాయింట్లు:

  • ఫ్లాట్  నరేషన్

డెడ్ పిక్సల్స్ వెబ్ సిరీస్ రేటింగ్: 2.75/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు