
తరుణ్ భాస్కర్ నటించిన ఓం శాంతి శాంతి శాంతిః బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం OTT విడుదలకి సిద్ధమైంది.
ఈ చిత్రం మార్చి 4, 2026 నుండి ఆహా వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి ఏ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతాన్ని అందించారు. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షైక్, నవీన్ సనివారపు సంయుక్తంగా నిర్మించారు.
