Side Effects Of Aloevera: అలోవెరాతో కలిగే దుష్ప్రయోజనాలు

Side Effects Of Aloevera: కలబందలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి మనము బాగా డిస్కస్ చేసుకున్నాము. ఆయుర్వేదంలో కూడా కలబందకు మంచి ప్రముఖ స్థానం ఉంది. ఎన్నో రకరకాల పద్ధతులతో కలబందని బ్యూటీ టిప్స్ లో ఉపయోగించుకోవచ్చు. అయితే కలబంద వల్ల ఎన్నో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

uses-and-side-effects-of-aloevera
Source: us.nivea.com

కలబంద వల్ల ఆరోగ్య దుష్ప్రయోజనాలు

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

కలబందను గుజ్జును అలాగే తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పరిశోధకులు దీన్ని ఎలుకలపై ప్రయోగించినప్పుడు వచ్చిన ఫలితం అందరినీ షాక్ కు గురి చేసంది. కాబట్టి కలబందను ఉపయోగించే ముందు డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోండి.

గర్భిణులకు హానికరం

కలబంద ఆరోగ్యానికి మంచిదే అయినా గర్భిణుల్లో ఇది నెగిటివ్ గా ప్రభావం చూపిస్తుంది. గర్భినులు కలబంద రసాన్ని తీసుకుంటే అది కడుపులోకి వెళ్లి విషంగా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

అలెర్జీలకు కారణం కావచ్చు

కలబందను రెగులర్ గా తీసుకుంటే కడుపు నొప్పి, వికారం, వాంతులు, దద్దుర్లు వస్తాయి. డాక్టర్ సలహా మేరకే కలబందను తీసుకోవాలి. రోజూ కలబంద తాగడం బాడీలో నెగటివ్ ఎఫెక్ట్స్ ను పెంచుతుంది.

హైపోకలేమియాకు కారణం

కలబంద తీసుకుంటే బాడీలో పొటాషియం స్థాయి తగ్గే అవకాశం ఉంది. ఇది మూర్ఛలకు కూడా దారి తీయవచ్చు. కీమోథెరపీ సమయంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.

కాలేయానికి హానికరం

కలబంద లివర్ కు మంచిది కాదు. కాలేయ సమస్యలు ఉన్నవారు కలబందను తీసుకోకపోవడమే మంచిది. కలబందను రోజు హార్లిక్స్, బూస్ట్, పాలలాగా తీసుకోవడము ఆరోగ్యానికి మంచిది కాదు. కేవలం మార్కెట్ లో తమ అమ్మకాలు పెరగడానికే కొంత మంది రోజూ కలబంద జ్యూస్ మంచిదంటారు.

చర్మం పై ప్రతీకూల ప్రభావం

బ్యూటీ ప్రాడక్ట్స్ తయారీలో కలబందను ఎక్కువగా వాడుతారు. చర్మ కాంతికి, మొటిమలు తగ్గించడానికి కలబందను ఫేస్ ప్యాక్ గా ఉపయోగిస్తారు. అయితే చర్మం పై కలబందను రెగురల్ గా వాడితే చర్మంపై దురదలు పెరిగే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు