స్మృతీ మంధాన పెళ్లి సందడి మొదలైంది: మహిళల వరల్డ్ కప్ విజేతల ‘మున్నాభాయ్’ వీడియో వైరల్

భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతీ మంధాన వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళల వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు సభ్యులు స్మృతీకి ప్రత్యేకంగా ఒక ‘మున్నా భాయ్ MBBS’ స్టైల్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేయడంతో అభిమానుల్లో హుషారు నెలకొంది.

Smriti Mandhana to Marry Soon

ఈ వీడియో విడుదల కావడంతో స్మృతీ పెళ్లి సంబరాలు అధికారికంగా స్టార్ట్ అయినట్లే!

వైరల్ అవుతున్న వీడియోలో జట్టు సభ్యులు సరదాగా మున్నా భాయ్ స్టైల్లో ‘జాదూ కి ఝప్పీ’ ఇచ్చినట్లు స్మృతీకి శుభాకాంక్షలు చెప్పినట్లు చూపించారు.

ముఖ్యంగా వరల్డ్ కప్‌లో భారత్‌కు విజయాన్ని అందించిన కీలక ఆటగాళ్లు ఈ వీడియోలో కనిపించడంతో అభిమానుల్లో ఇంకా జోష్ పెరిగింది.

వీడియో చూసిన స్మృతీ సోషల్ మీడియాలో స్పందిస్తూ “నా గాళ్స్ మరీ పిచ్చి చేయడం ఆపరు” అంటూ హృదయపూర్వక ఎమోజీలతో స్పందించింది. ఆమె రియాక్షన్ కూడా క్షణాల్లో వైరల్ అయింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు