దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత అందరికీ జమ కాలేదు. మీ ఖాతాకు కూడా డబ్బులు రాకపోతే, మీరు ఒక్కరే కాదు చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఈసారి డబ్బులు ఎందుకు జమ కాలేదన్న విషయంలో అధికారుల నుంచి స్పష్టమైన వివరణ ఇంకా వెలువడలేదు.

ప్రభుత్వం అధికారికంగా కారణం వెల్లడించకపోయినా, సాధారణంగా రైతులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి: e-KYC పూర్తి కాలేకపోవడం… పీఎం కిసాన్ పేమెంట్లు పొందడానికి e-KYC తప్పనిసరి. డిజిటల్ KYC పూర్తి చేయని రైతులకు ఇన్స్టాల్‌మెంట్ నిలిపివేయబడే అవకాశం ఉంది, బ్యాంక్ ఖాతా Aadhaarతో లింక్ కాకపోవడం, IFSC కోడ్ మార్పులు లేదా పాత బ్యాంక్ ఖాతా క్లోజ్ అయి ఉండటం, ఈ కారణాలు కూడా డబ్బులు జమ కాకపోవడానికి దారితీస్తాయి.
పీఎం కిసాన్ సాయం తీసుకుంటున్న రైతుల భూ రికార్డులు అప్డేట్ అయి ఉండాలి. రికార్డులలో తప్పులు ఉంటే పేమెంట్ ఆగిపోతుంది. అలాగే కొన్ని ప్రాంతాలలో వెరిఫికేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వల్ల ఇన్స్టాల్‌మెంట్ జమలో ఆలస్యం ఉంటుంది.
ఇవన్నీ కాకుండా సర్వర్ సమస్యలు, పేమెంట్ గేట్వే ఇష్యూలు కూడా పేమెంట్ హోల్డ్ అయ్యే పరిస్థితిని తీసుకువస్తాయి.
పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో మీ పేమెంట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు:
1. pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2. Farmers Corner సెక్షన్‌లోకి వెళ్లండి
3. Beneficiary Status ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
4. మీ Aadhaar లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయండి
ఇక్కడ మీకు Payment Pending, FTO Generated, RFT Signed వంటి స్టేటస్‌లు కనిపిస్తాయి.
మీ స్టేటస్, KYC, బ్యాంక్ వివరాలను చెక్ చేసుకోవడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు. ఎటువంటి కారణం లేకుండా డబ్బులు జమ కాలేదు అనిపిస్తే, మీ జిల్లా వ్యవసాయ శాఖను సంప్రదించడం మంచిది.
