YSR Cheyutha Scheme: వైఎస్సార్ చేయూత స్కీం పూర్తి వివరాలు

YSR Cheyutha Scheme: సీఎం జగన్ ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వాటిలో ఈ చేయూత స్కీం కూడా ఉంది. ఈ చేయూత స్కీం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 75వేల ఆర్థక సాయం అందించబడుతుంది. అయితే ఈ స్కీం కు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? పెన్షన్ తీసుకుంటున్న మహిళలు దీనికి అర్హులా? లాంటి అన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

ysr-cheyutha-scheme

వైఎస్సార్ స్కీం కు కావలసినవి 

  • దరఖాస్తుదారులు జూన్ 13, 2021 నాటికి 45 ఏళ్ల వయసు కలిగి ఉండాలి
  • తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • ఆధార్ కార్డు ఉండాలి
  • అప్డేట్ అయిన ఆధార్ కార్డు ఉండాలి
  • ఆధార్ కార్డు మొబైల్ నంబర్ కు లింక్ చేయాలి
  • కుల దృవీకరణ పత్రము
  • బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్ మొబైల్ నంబర్, ఆధార్ తో లింక్ చేసి ఉండాలి

ఎవరిని సంప్రదించాలి?

పైన ఇచ్చిన అన్ని పత్రాలను దగ్గర వుంచుకొని మీ పరిధిలో ఉన్న గ్రామవాలంటీరును సంప్రదించాలి. గ్రామ వాలంటీరు మీవివరాలన్నింటినీ సేకరించి మీరు ఈ వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులా కాదా అని నిర్ణయిస్తారు.

ఈ పథకాలన్నింటికీ అప్లై చేసే ముందు మీ ఆధార్ మీ మొబైల్ కు లింక్ చేసి ఉందో లేదో ఛూసుకొవాలి. లింక్ చేసిన మొబైల్ నంబర్ ను మీరు ఎప్పుడూ యాక్టివ్ లో వుంచాలి. వెరిఫికేషన్ సమయంలో మీ ఆధార్ లింక్ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు