
దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా DC చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది. DC సినిమా సెప్టెంబర్ 4, 2026 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది.
అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ముకేష్ జి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, అనిరుధ్ సంగీతం అందించారు. Sun Pictures బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి, తలైవాసల్ విజయ్, అవినాష్ రఘుదేవన్, శ్రీకృష్ణ దయాల్ తదితరులు నటించారు.
