గరివిడి లక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రైమ్ వీడియోలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

గరివిడి లక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రైమ్ వీడియోలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డ్రామా చిత్రం ఇది.

థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, పర్వాలేదనిపించే స్పందనను అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

గరివిడి లక్ష్మి నవంబర్ 27, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో కాయల్ ఆనంది, రాగ్ మయూర్, శ్రీనివాస్ అవసరాల, అంకిత్ కొయ్య, వీకే నరేష్, రాశి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించగా, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు