బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన రాగ్ మయూర్ మూవీ.. ఇప్పుడు Sun NXTలోకి!

బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన రాగ్ మయూర్ మూవీ.. ఇప్పుడు Sun NXTలోకి!

ఈ సినిమాపై విడుదలకు ముందే రెండు కారణాలతో మంచి హైప్ ఏర్పడింది. మొదటిది, ఈ చిత్రానికి డీజే టిల్లు దర్శకుడు దర్శకత్వం వహించడం కాగా, రెండోది సినిమా బండి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్ ఇందులో హీరోగా నటించడం.

అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం నవంబర్ 20, 2026 నుంచి సన్ NXT ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, అనన్య, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, అజయ్, మస్త్ అలీ, రాశి, చరిత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. రాజీవ్ చిలక, మేఘా చిలక, స్నేహ రాజేష్ జగ్తియాని, విహాన్ దండ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు