Know Your Volunteer: మీ ఆధార్ నంబర్ ను సబ్మిట్ చేసి మీ గ్రామ వాలంటీర్ వివరాలను తెలుసుకోండి

Know Your Volunteer: గ్రామ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో ఈ గ్రామ వాలంటీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు.

ప్రభుత్వానికి సంబంధించిన వాటి విషయాల్లో ఏదైనా సమస్య తలెత్తితే గ్రామవాలెంటీర్ సాయం ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించమని కోరవచ్చు.

know-your-volunteer-by-submitting-aadhar-numberఅయితే రాఫ్ట్రంలో వేల మంది గ్రామవాలంటీర్లు ఉన్నారు. మీ గ్రామ పరిధిలో కూడా వాలంటీర్లు ఉంటారు. మీ గ్రామ వాలంటీరు ఎవరు అనే వివరాలను ఇప్పుడు మీరు నేరుగా ఆన్ లైన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

గ్రామవాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు ఎన్నో సేవలను అందిస్తున్నారు. కరోనా సమయంలో సరుకులు పంపిణీ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. కొన్ని విషయాల్లో గ్రామవాలంటీరు నేరుగా మీ ఇంటికి వచ్చే వివరాలను సేకరిస్తారు.

సీఎం జగన్ అధికారంలోకి రాగానే వేల సంఖ్యలో గ్రామవాలంటీరు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అనేక మంది నిరుద్యోగులకు ఈ గ్రామ వాలంటీరు పోస్టు సువర్ణఅవకాశంగా మారింది. సేవే పరమావధిగా జీవించాలనుకునే వారికి ఈ గ్రామ వాలంటీరు ఉద్యోగం సరిగ్గా సరిపోతుంది. జిల్లాకు కలెక్టరే పెద్ద ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, కానీ గ్రామ వాలంటీరే కీలకంగా వ్యవహరిస్తారు.

నేడు ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ సవ్యంగా, సునాయాసంగా, త్వరాగా పూర్తవుతున్నాయంటే దానికి కారణం గ్రామవాలంటీర్లే.

మీ గ్రామ వాలంటీర్ ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ అధికారిక వెబ్సైట్ లింక్ పైక్లిక్ చేయండి. లింక్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి. దాని కింద వెరిఫెకేషన్ కోసం క్యాప్చా ఎంటర్ చేయండి. సబ్మిట్ ఎంటర్ బటన్ నొక్కగానే మీ గ్రామానికి సంబంధించిన వాలంటీర్ వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి.

ఇక్కడ కింద క్లిక్ చేయండి

మీ గ్రామ వాలంటీర్ వివరాల కోసం ఈ వెబ్సైట్ లింక్

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు