6 Step Validation Status: ఆంధ్ర ప్రదేవ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, హామీ ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో నవరత్నాల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ నవరత్నాల పథకాలు.. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇంటి పట్టాలు, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, ఇలా 9 సంక్షేమ పథకాలను పేదల కోసం అమలు చేస్తున్నారు. ఈ పథకాల లబ్ది పొందాలంటే ముందుగా 6 దశల్లో దృవీకరణ జరగాల్సిందే.
ఆరు దశల దృవీకరణ
భూమి
ఎక్కువ భూమి కలిగి ఉన్నవారికి ఈ 9 రత్నాలు వర్తించవు. వారికి ఎంత భూమి ఉంది అనేది ఈ వెబ్ సైట్ లింక్ ద్వారా తెలుసుకునే వీలు ఉంటుంది. సంబంధిత గ్రామ వాలంటీర్ దీనిని చూసి దృవీకరణ పత్రాన్ని అందచేస్తారు.
ఫోర్ వీలర్
సొంత కారు కలిగి ఉంటే కూడా ఈ నవరత్నాల పథకాలు వర్తించవు. దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్ నంబరు తో ఏదైనా ఫోర్ వీలర్ ఉందా లేదా అని ఈ ట్రాన్స్ పోర్ట్ వెబ్సైట్ ద్వారా తెలుసుకుంటారు.
ప్రభుత్వ ఉద్యోగం
ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి కూడా ఈ నవరత్నాల పధకాలు వర్తించవు. దరఖాస్తు చేసుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగా లేదా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ ద్వారా వారి HRMS ID, CFMS ID తెలుసుకోవచ్చు.
ఆదాయపు పన్ను
ఆదాయపు పన్ను ఎక్కువ ఉంటే కూడా మీకు ఈ నవరత్నాల పథకాలు వర్తించవు. దరఖాస్తు దారుని ప్యాన్ నంబర్ ను ఈ వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే వారి ఆదాయపు పన్ను వివరాలు తెలుస్తాయి.
విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగాన్ని బట్టి కూడా నవరత్నాలకు అర్హులా కాదా అని నిర్ణయిస్తారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే మీరు అనర్హులవుతారు. వాటి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
పట్టన ఆస్థి
ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలను బట్టి కూడా నవరత్నాల పథకానికి అర్హుడా కాదా అని నిర్ణయిస్తారు. వాటి వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
- YSR Rythu Bharosa Status: వైఎస్సా రైతు భరోసా స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?
- Ap Welfare Schemes Calender 2021 – 2022: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ 2021 – 2022
- Rice Card Application Status: రాషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?
- How To Apply For LLR, DL In Ap: ఏపీలో లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్సుకు ఎలా అప్లై చేసుకోవాలి?