ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2025 సంవత్సరం క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను IBPS వెబ్సైట్లో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు.

ఎలా చెక్ చేసుకోవాలి?
అభ్యర్థులు తమ ఫలితాలను చూసేందుకు ఈ స్టెప్స్ ఫాలో కావాలి:
1 . IBPS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి
2 . “IBPS Clerk Prelims 2025 Result” లింక్‌పై క్లిక్ చేయండి
3 . మీ రిజిస్ట్రేషన్ నంబర్ / రోల్ నంబర్ మరియు పాస్వర్డ్ / DOB నమోదు చేయండి
4 . లాగిన్ అయ్యి మీ స్కోర్‌కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రిలిమ్స్‌లో పొందిన స్కోర్ ఆధారంగా IBPS మెయిన్స్‌కు అర్హులైన అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈసారి కట్ఆఫ్ కొద్దిగా మారింది. పోటీ అత్యంత తీవ్రంగా ఉండడంతో స్కోర్లు కూడా గట్టి స్థాయిలో ఉన్నాయి, ముఖ్యంగా జనరల్/OBC కేటగిరీలలో కట్ఆఫ్ పెరిగినట్లు తెలుస్తోంది.
IBPS ఇప్పటికే క్లర్క్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ విడుదల చేసింది. మెయిన్స్ పరీక్ష నవంబర్ 29, 2025 న జరుగుతుంది.
అభ్యర్థులు స్కోర్‌కార్డ్‌ను సురక్షితంగా సేవ్ చేసుకోవాలి, మెయిన్స్ హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు స్కోర్‌కార్డ్ అవసరం కావచ్చు, కట్ఆఫ్ వివరాలు స్కోర్‌కార్డ్‌లో పూర్తిగా ఇవ్వబడతాయి
ఫలితాలు విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో #IBPSClerk2025 ట్రెండ్ అవుతోంది. కొంతమంది అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మెయిన్స్‌కు సిద్ధమవుతున్నారు.
