F3 Telugu Movie Review: ఎఫ్ 3 తెలుగు మూవీ రివ్యూ

F3 Telugu Movie Review: వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 బిగ్గెస్ట్ హిట్ అయ్యింది ఆది మనందిరికి తెల్సిన విషయమే ఎఫ్ 2 తర్వాత తెలుగులో బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంచైజీగా అవతరించింది, ఎఫ్ 2 విజయంతో, అనిల్ రావిపూడి ఎఫ్ 3తో ముందుకు వచ్చారు, ఎఫ్ 3 విడుదల కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు, కానీ మహమ్మారి కారణంగా చాలాసార్లు వాయిదా పడింది కానీ ఇప్పుడు ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ఈరోజు అంటే మే 27, 2022 న విడుదలైంది,అయితే ఆలస్యం చేయకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనే దానిపై లోతైన సమీక్షలోకి వెళ్దాం.

F3 Telugu Movie Review

కథ

F3 కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది, వెంకీ (వెంకటేష్) మరియు వరుణ్ (వరుణ్ తేజ్) వారి భార్యల ఖర్చుల కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు, అయితే, వెంకీ మరియు వరుణ్ తమ నష్టాలను భరించడానికి హోటల్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు ,కానీ ఒక డబ్బున్న మహిళా విల్ల హోటల్ కి వచ్చాక కథ వేరే మలుపు తిరుగుతుంది, అయితే దురదృష్టవశాత్తు, హారిక (తమన్నా) అత్యాశతో కూడిన కుటుంబం కారణంగా వెంకీ మరియు వరుణ్ ఈ పరిస్థితిలో చిక్కుకుంటారు . చివరకు ఈ పరిస్థితి నుంచి వెంకీ, వరుణ్ ఎలా బయటపడ్డారు అనేది మిగతా కథ.

F3 మూవీ నటీనటులు

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, పూజా హెడ్గే, సునీల్, మురళీ శర్మ, ప్రగతి, రఘుబాబు తదితరులు, ఈ చిత్రానికి దర్శకత్వం అనిల్ రావిపూడి, సినిమాటోగ్రఫీ సాయిశ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ మరియు దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం.

సినిమా పేరుF3
దర్శకుడుఅనిల్ రావిపూ
నటీనటులువెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, పూజా హెడ్గే, సునీల్, మురళీ శర్మ, ప్రగతి, రఘుబాబు
నిర్మాతలుశిరీష్
సంగీతందేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీసాయిశ్రీరామ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

F3 సినిమా ఎలా ఉందంటే?

కామెడీ చిత్రాలకు కథ అవసరం లేదు, ఎందుకంటే ప్రేక్షకులను నవ్వించడమే నవ్వించడమే మేకర్స్ యొక్క అంతిమ ఉద్దేశ్యం, అయితే ప్రేక్షకులు కూడా కామెడీని ఆస్వాదించినట్లయితే కథ గురించి కూడా ఆలోచించరు, అయితే, F3 అదే కోవలోకి వస్తుంది, F3 లొ గొప్ప కథేం లేదు కానీ పక్క పైసావసూల్ సినిమా అని చెప్పగలను.
అయితే, సినిమా కథ మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది, ఇది డబ్బు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది,అయితే, 30 నిమిషాల తర్వాత కథ ముందుకు సాగకపోవడంతో సినిమా ఫ్లాట్‌గాఅనిపిస్తుంది, కామెడీ సన్నివేశాలు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది, మొదటి సగం కీలక పాత్రల పరిచయం మరియు వారి లోపాలను కామెడీ సన్నివేశాలతో ముగుస్తుంది. కానీ సెకండాఫ్‌లో కొంత కథ చెప్పడానికి ప్రయత్నించినా అదేం అంత వర్క్ అవుట్ అవ్వలేదు.
F3 యొక్క అతిపెద్ద బలం వెంకటేష్ మరియు వరుణ్ తేజ్, ఈసారి అనిల్ రావిపూడి వారి పాత్రకు కొన్ని లోపాలను జోడించారు, వెంకటేష్‌కి రే చీకటి మరియు వరుణ్ తేజ్‌కు నత్తిగా మాట్లాడే సమస్య ఉంటుంది మరియు వెంకటేష్ తన అద్భుతమైన నటనతో తన పాత్ర ని ఇంకో మెట్టు ఎక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అతను ప్రతి ఫ్రేమ్‌లో మిమ్మల్నిఆకట్టుకోవడం లో విజయవంతం అయ్యాడనే చెప్పాలి మరియు వరుణ్ ప్రతి సన్నివేశంలోనూ వెంకటేష్‌తో పోటీ పది మరి నటించాడు, ఇక హారికగా తమన్నా బాగా నటించింది, ఆమె పాత్రలో కొత్త షేడ్స్ ఉండడం వల్ల ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ షాక్‌కి గురి చేస్తుంది మరియు హనీగా మెహ్రీన్ జస్ట్ ఓకే, మురళీ శర్మ మరియు సోనాల్ చౌహాన్ ఈ ఫ్రాంచైజీలో కొత్త ఎంట్రీలు మరియు వారు తమ తమ పాత్రలను బాగా చేసారు మరియు మిగిలిన తారాగణం బాగా చేసారు.

అనిల్ రావిపూడి హాస్య చిత్రాలను తీయడంలో నిష్ణాతుడని మనందరికీ తెలుసు, అతను ఏ సినిమా చేసినా కామెడీని జోడించి తీస్తూ ఉంటాడు, ఒక విదంగా అదే అతన్ని విజయవంతమైన దర్శకుడిని చేసిందని చెప్పొచ్చు , అయితే అతను స్వయంగా కథ చెప్పడానికి ప్రయత్నించలేదు, రెండున్నర గంటల పాటు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు అయితే నవ్వించడంలో విజయవంతమయ్యాడనే చెప్పాలి అయితే ఈసారి డబ్బు గురించి కుడా కొంత సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాడు, అయినప్పటికీ, అతను ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించాడు.

సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ జస్ట్ పర్వాలేదు మరియు DSP సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు F3 కంటే F2 పాటలు మరియు నేపథ్య సంగీతం బాగుంటుంది, F3 సాంకేతికంగా అద్భుతంగా కనిపిస్తుంది మరియు మిగిలిన విభాగాలు సినిమా అవసరాలకు అనుగుణంగా బాగా చేసాయి.

చివరగా, F3 కామెడీ కోసం మాత్రమే చూడవలసిన చిత్రం.

సినిమా రేటింగ్: 3.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు