Mahaveerudu Movie Review: మహావీరుడు మూవీ రివ్యూ

Mahaveerudu Review: చిన్న చిన్న పాత్రలు చేస్తూ,స్టార్ హీరోగా ఎదిగిన శివకార్తికేయన్, రెమో చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. ఇక డాన్, డాక్టర్ మరియు ప్రిన్స్ చిత్రాలతో ఇంకా దగ్గరయ్యాడు, ఇక ఇప్పుడు మళ్ళి ‘మహావీరుడు’ అనే ఫాంటసీ యాక్షన్ చిత్రంతో మన ముందుకొచ్చాడు. ఇక ట్రైలర్ తొనే మంచి అంచనాలని క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందొ ఈ రివ్యూ లో తెల్సుకుందాం.

Mahaveerudu Movie Review

కథ

ఒక భయస్తుడు కార్టూనిస్ట్ (శివకార్తికేయన్) గా పని చేస్తూ ఉంటాడు, అయితే తనకి ఒక పొలిటికల్ పార్టీ నుండి ఒక కాంట్రాక్ట్ వస్తుంది, ప్రజలని ఆకర్షించడానికి మంచి కార్టూన్స్ డిజైన్ చేయాలనీ తనకి పని ఇస్తారు, అయితే హీరొ ఒక కల్పితమైన పాత్రని సృష్టిస్తాడు, అనుకోకుండా ఆ పాత్ర, ఈ భయస్తుడైన హీరొ పైకి చూసినప్పుడల్ల ఆ పాత్ర ఇతనిలో ఆవహించినట్టు అయ్యి శక్తివంతుడి గా మారిపోతాడు. అసలు ఆ పాత్ర ఏంటి, ఎలా ఆ పాత్ర ఆవహిస్తుంది, పైకి చూస్తే ఎం కనిపిస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ చిత్రం చూడాల్సిందే.

మహావీరుడు మూవీ నటీనటులు

శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు మరియు తదితరులు, దర్శకత్వం మడోన్ అశ్విన్, సంగీతం భరత్ శంకర్, విషు అయ్యన్న ఛాయాగ్రహణం, మరియు శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరుమహావీరుడు
దర్శకుడుమడోన్ అశ్విన్
నటీనటులుశివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు మరియు తదితరులు
నిర్మాతలుఅరుణ్ విశ్వ
సంగీతంభరత్ శంకర్
సినిమాటోగ్రఫీవిషు అయ్యన్న
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

మహావీరుడు సినిమా ఎలా ఉందంటే?

దాదాపుగా కమర్షియల్ సినిమాలన్ని ఒక టెంప్లేట్ని ఫాలో అవుతు ఉంటాయి, హీరో ఇంట్రడక్షన్, ఒక పాట, ఫైట్, లవ్ ఇలా. అయితే మహావీరుడు కూడా కమర్షియల్ సినిమానే, కానీ మనం చూసే రెగ్యులర్ టెంప్లేట్లో నడిచే సినిమా కాదు. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసి, దాని చుట్టూ కమర్షియల్ అంశాలని జోడించి అల్లిన కథే ఈ మహావీరుడు.

ఈ చిత్రం ఒక మాములు కమర్షియల్ సినిమాలాగే ప్రారంభం అయిన, ఒక్కసారి హీరొ పాత్ర పరిచయం చేసాక, కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొదటి సగం హీరొ తాలూకు భయాలు, తన పని, తన ప్రేమ కథని కామెడితో జోడించి ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు మడోన్ అశ్విన్. అయితే ఇంటర్వెల్ బ్లాక్ మనల్ని రెండవ భాగం చూసేలా చేస్తుంది.

ఇక రెండవ భాగం ఆధ్యంతం ఆసక్తికరమైన సన్నివేషాలతో ఎంగేజ్ చేస్తుంది మరియు హీరొ ఒక భయస్తుడి గా ఉండి, ఒక్కసారిగా శక్తివంతుడు అవ్వడాన్ని చాలా బాగా చూపించారు. అయితే హీరో సృష్టించిన పాత్ర, తను శక్తివంతంగా అవ్వడానికి ఎలా ఉపయోగపడిందో అనే ఆసక్తికర విషయాన్ని ఆకట్టుకునేల తెర మీద ప్రెసెంట్ చేసారు. పొలిటికల్ యాంగిల్ అంత ఆసక్తికరంగా అనిపించకపోయినా, హీరొ క్యారెక్టర్ వల్ల రెండున్నర గంటలపాటు మిమ్మల్ని సీట్ కి అతుక్కుపోయేలా చేస్తుంది.

ఇక నటన విషయానికి వస్తే, కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, కొంచెం కొత్తగా ట్రై చేసే శివకార్తికేయన్, ఈసారి కూడా, ఒక కొత్త రకమైన కమర్షియల్ చిత్రాన్ని మనకి అందించాడు . ఇక ఈ చిత్రం లో కూడా తన రెగ్యులర్ పాత్రలకి భిన్నంగా, ఒక భయస్తుడి పాత్రలో చాలా బాగా నటించాడు. అదితి శంకర్, పాత్రకి మంచి స్క్రీన్ టైం దొరికింది, ఇక ఆ పాత్రకి నూరు శాతం న్యాయం చేసిందని చెప్పొచ్చు, మిస్కిన్ ఉన్నంతలో పర్వాలేదు, ఇక తెలుగులో మంచి పేరుగాంచిన కమెడియన్ సునీల్, మొదటిసారి తమిళ్ లో నటించిన చిత్రం ఇది, తను కూడా ఉన్నంతలో బాగా చేసాడు, ఇక మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగా చేసారు.

మండేలా చిత్రంతో మడోన్ అశ్విన్, ప్రశంసలు అందుకున్నాడు, ఇక ఒక స్టార్ హీరో తో చిత్రం చేస్తున్నాడు అనేసరికి, రెగ్యులర్ కథతో వస్తాడు అనుకున్నారు అందరు, కానీ కొత్త కథకే, కొంత కమర్షియల్ అంశాలని జోడించి, చాల బాగా తెర మీద ప్రెసెంట్ చేసాడు. ముఖ్యంగా ఫాంటసీ ని ఈ చిత్రం లో మిళితం చేసిన విధానానికి మనం మడోన్ అశ్విన్ ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇక సగటు ప్రేక్షకున్ని మెప్పిచడంలో మడోనా అశ్విన్ విజయం సాధించాడని చెప్పొచ్చు.

సాంకేతికంగా, మహావీరుడు చాలాబాగుంది, ఇక భరత్ శంకర్ పాటలు మంచి విజయం సాధించాయని విషయం మనకి తెల్సిందే, నేపధ్య సంగీతం కూడా చాల బాగా ఇచ్చాడు. ఇక విషు అయ్యన్న ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు.

చివరగా, మహావీరుడు ఒక కొత్తరకమైన కమర్షియల్ చిత్రం.

ప్లస్ పాయింట్లు:

  • కథ
  • కథనం
  • నేపధ్య సంగీతం
  • ఛాయాగ్రహణం

మైనస్ పాయింట్లు:

  • ఏమి లేవు

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు