
ఈ సినిమాలో పేరున్న నటులు చాల మంది నటించారు, అయినా కూడా రెండు వారాల క్రితం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్, అభినవ్ గోమటం, చైతన్య రావు, కిరీటి దామరాజు, సహితి అవంచ, మోహిత్, వాసు ఇంటూరి తదితరులు నటించారు.
ఈ చిత్రాన్ని చెందు ముద్దు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీని సునీల్ కుమార్ నామా నిర్వహించగా, సంగీతాన్ని ప్రిన్స్ హెన్రీ అందించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామ్ వీరపనేని నిర్మించారు.
