సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? పూర్తి వివరాలు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు పూర్తి వివరాలు

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 12న ఈటీవీ విన్ (ETV Win) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

శివాజీ, లయలతో పాటు ఈ సినిమాలో అలి, ధనరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాంప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన, దర్శకత్వం వహించగా, సంగీతాన్ని రంజిన్ రాజ్ అందించారు. సినిమాటోగ్రఫీని రిథ్విక్ రెడ్డి నిర్వహించారు. ఈ చిత్రాన్ని శివాజీ సొంటినేని నిర్మించారు.

ఈ చిత్రం టీజర్, పోస్టర్స్ చూస్తుంటే, ఫ్యామిలీ డ్రామాకి, క్రైమ్ మిక్స్ చేసి, మంచి సినిమా తీశారనిపిస్తుంది. మరి మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారో చూడాలి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు