
నటుడు మహేంద్రన్ బాల నటుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, “మాస్టర్” సినిమాలో నటించిన తర్వాత కథానాయకుడిగా స్థిరపడ్డాడు. ఆయన తాజా చిత్రం “నీలకంఠ” తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది.
ఈ చిత్రం థియేటర్లో పెద్దగా ఆడలేదు, ఇక ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 06, 2026 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్, యశ్న ముత్తులూరి, నేహా పఠాన్, స్నేహ ఉల్లాల్, రామ్కి, బబ్లూ పృథ్వీరాజ్, శుభలేఖ సుధాకర్, భరత్ రెడ్డి, సత్య ప్రకాశ్, చిత్రమ్ సీను, శివకార్తిక్ దండా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి రాకేష్ మాధవన్ రచన, దర్శకత్వం వహించగా, శ్రవణ్ జి కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహించారు, మార్క్ ప్రశాంత్ సంగీతాన్ని అందించారు. ఎం. శ్రీనివాసులు, డి. వేణుగోపాల్ నిర్మాతలుగా వ్యవహరించారు.
