
యూత్‌ఫుల్ కామెడీ డ్రామా వాళా 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మలయాళ చిత్రం తెలుగులో కూడా థియేటర్లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు ఈ యూత్‌ఫుల్ చిత్రం వాళా 2 మే 8, 2026న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి, దేవరాజ్, అజు వర్గీస్, అల్ఫోన్స్ పుత్రెన్, సుధీష్, విజయ్ బాబు తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కథను విపిన్ దాస్ అందించగా, దర్శకత్వం సావిన్ ఎస్ఏ వహించారు. సినిమాటోగ్రఫీని అఖిల్ లైలాసురన్ నిర్వహించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఏ టీం అందించింది.
ఈ చిత్రంలోని పాటలను మలయాళి మంకీస్, రాజత్ ప్రకాష్ (హాట్స్మిత్), పర్వతీష్ ప్రదీప్, ఆర్జీ, ముత్తు, ఆర్కాడో, జజీర్ మహమ్మద్, అశ్విన్ ఆర్యన్, ఎలక్ట్రానిక్ కిలి స్వరపరిచారు.
ఈ చిత్రాన్ని విపిన్ దాస్, హారిస్ డేసమ్, సాహు గరపాటి, పి.బి. అనీష్, ఆదర్శ్ నారాయణ్ మరియు ఐకాన్ స్టూడియోస్ నిర్మించగా, ఇక ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
