
మాలీవుడ్ స్టార్ నటీనటులతో రూపొందిన పేట్రియట్ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. అయితే సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడంలో విఫలమైంది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. పేట్రియట్ 2026 జూన్ 05 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహాద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చగా, మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఆంటో జోసెఫ్ మరియు కే. జి. అనిల్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
