సూర్య బ్లాక్‌బస్టర్ మూవీ వీరభద్రుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

సూర్య బ్లాక్‌బస్టర్ మూవీ వీరభద్రుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి

వరుస పరాజయాల తర్వాత హీరో సూర్య భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన చిత్రం కరుప్పు అదే తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల అయింది. థియేటర్లలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

వీరభద్రుడు జూన్ 12, 2026 నుంచి ప్రైమ్ వీడియో లో ప్రసారం కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో సూర్య తో పాటు త్రిష, ఆర్ జె బాలాజీ, నట్టి, ఇంద్రన్స్, స్వశిక, అనఘా, మాయా రవి, శివధ, సుప్రీత్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి దర్శకత్వం ఆర్ జె బాలాజీ వహించగా, ఛాయాగ్రహణాన్ని జి.కె. విష్ణు అందించారు. సంగీతాన్ని సాయి అభయంకర సమకూర్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు