
వరుస పరాజయాల తర్వాత నటి సమంతకు ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో భారీ బ్లాక్బస్టర్ విజయం దక్కింది. థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
‘మా ఇంటి బంగారం‘ జూలై 17, 2026 నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో సమంత, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, చైతన్య కృష్ణ, ఆనంద్, శ్రీలక్ష్మి, దిగంత్ మంచాలే, గౌతమి, మంజూష ముక్కావిల్లి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు.
