‘కాన్ సిటీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

కాన్ సిటీ' OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్

అర్జున్ దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ చిత్రం ‘కాన్ సిటీ’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ, సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘కాన్ సిటీ’ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

కాన్ సిటీ జూలై 24, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అర్జున్ దాస్‌తో పాటు యోగి బాబు, అన్నా బెన్, సాక్షి వైద్య, నంద గోపాల్, వీటీవీ గణేష్, అరుల్ దాస్, వడివుక్కరసి, అఖిలన్, దీపా రామానుజం, రాధా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి హరీష్ దురైరాజ్ దర్శకత్వం వహించగా, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందించారు. షాన్ రోల్డన్ సంగీతాన్ని సమకూర్చగా, పవర్ హౌస్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు