
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ ఈ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఇప్పుడు ఈ చిత్రం OTTలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తుడక్కం సెప్టెంబర్ 18, 2026 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో మోహన్‌లాల్, విస్మయ మోహన్‌లాల్, బాబీ కురియన్, మనోజ్ కె. జయన్, గణేష్ కుమార్, జాఫర్ ఇడుక్కి, ఆశిష్ జో ఆంటోనీ, సాయి కుమార్, అశ్విన్, ఎస్సా, కొట్టాయం రమేష్, జయ కురుప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చగా, అఖిల్ జార్జ్, జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
