
విజయ్ సేతుపతి నటించిన ‘బత్తా’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని విభిన్నమైన కథనం, అద్భుతమైన రచన ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘బత్తా’ చిత్రం అక్టోబర్ 29, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లిజోమోల్ జోస్, విష్ణు గోవిందన్, అర్జున్ చిదంబరం, అజయ్ ఘోష్, మాస్టర్ సాయి పృథ్వీరాజ్, హరి కృష్ణన్, శాంతి బాలచంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
బాలాజీ తరణీతరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఎస్కే సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. మురాద్ ఖేతాని, ప్రియా అట్లీ, అలోక్ జైన్, అజిత్ అంధారే ఈ చిత్రాన్ని నిర్మించారు.
