బల్లి శాస్త్రం: భారతీయ సంప్రదాయం లో ఎన్నో శకునాలు నమ్ముతుంటారు. వీటిల్లో బల్లి శకునాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. బల్లి శరీరం పై పడే చోటుని బట్టి అది మంచి శకునమా లేక అపశకునమా అని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ బల్లి శాస్త్రం శకునాలు, పురుషులకు స్త్రీలకు వేరు వేరుగా ఉంటాయి. జ్యోతిష్యం లో ని గౌలి పటన శాస్త్రం ఈ బల్లి పడితే కలిగే శుభం అశుభాలు గురుంచి వివరిస్తుంది.
బల్లి శాస్త్రం (Balli Sastram In Telugu)
పురుషుడికి కుడి భాగం పైన బల్లి పడితే శుభం కలుగుతుంది అదే భాగంలో స్త్రీ పై పడితే అశుభం కలుగుతుందని గౌలి శాస్త్రం చెబుతుంది. స్త్రీలకు ఎడం భాగం పై బల్లి పడితే శుభం కలుగుతుంది. రాత్రివేళల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉండవని కూడా పెద్దలు చెబుతున్నారు.
పురుషుల వివిధ శరీర భాగాలపై బల్లి పడితే కలిగే ప్రభావం:
తల – వివాదాలు చెలరేగుతాయి
వీపు – విజయం లభిస్తుంది
కలలో బల్లి కనపడితే – ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో బెంగ
ముఖం – ఊహించని సంపద
ఎడమ కన్ను – శుభవార్త
కుడి కన్ను – అనుకున్న పనులు పూర్తి కావు
పై పెదవి – గొడవలు
కింది పెదవి – ఆర్ధిక లాభం
రెండు పెదవులు – మరణ వార్త
నోటిఫై – ఆరోగ్యం నశిస్తుంది
మణికట్టు – ఇంటి మరమ్మత్తు
చేతి పై పడితే – ఆర్ధిక నష్టం
వేళ్ళపై పడితే – పాత మిత్రులు కలిసే అవకాశం
మీసాలపై పడితే – సంక్లిష్ట సమస్యలు
తొడలపై – వస్త్ర నష్టం
స్త్రీల వివిధ శరీర భాగాలపై బల్లి పడీతే కలిగే ప్రభావం
కుడి చేయి – కామ రాతి ప్రాప్తి
భుజం – ఆభరణాలు లభిస్తాయి
రొమ్ము – సుఖం లభిస్తుంది
ఎడమ చేయి – మానసిక సమస్యలు
మెడ – శత్రు సంహారం
కాలి పిక్కలు – బంధువుల రాక
కాలి మడమలు – సమస్యలు
కుడి కాలు – ఎదురు దెబ్బలు
కొప్పు – అనారోగ్య సమస్యలు
తల – మరణ భయం వెంటాడుతుంది
బల్లి మీద పడగానే వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. దోషం పోవాలంటే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శించాలి లేదా ఆ దేవాలయం దర్శించిన వారికి పాద నమస్కారం చేసినా దోషం తొలగుతుంది. వీలైతే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలోని బంగారు బల్లి దర్శనం చేసుకోవాలి.
బల్లి శాస్త్రం ఫలితాలు
పురుషుడి కుడి భాగంలో, మహిళలకు ఎడమ భాగంలో బల్లి పడితే మంచి జరుగుతుంది. రాత్రి సమయంలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉండవు. పురుషుడి ముఖం పై పడితే ఊహించని విధంగా సంపద వస్తుంది. బల్లి కుడి కంటిపైన పడితే అనుకున్న కార్యం పూర్తికాదు. రెండుు పెదవులపై పడితే మరణవార్త వినే అవకాశం ఉంది. నోటిపై బల్లి పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కలలో బల్లి పడితే ప్రభుత్వానికి సంబంధించిన భయం పట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి:
- Balli Sastram Purushulaku: బల్లి శాస్త్రం పురుషులకు Pdf
- Kaaki Sastram In Telugu: కాకి శాస్త్రం తెలుగులో
- Balli Sastram Streelaku: బల్లి శాస్త్రం స్త్రీలకు pdf